Pawan Kalyan Highest Grosser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుంది. ఆయన అభిమానులు దేశంలోనే కాదు..విదేశాల్లో కూడా కోట్లలో ఉన్నారు. ముఖ్యంగా అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి చోట్ల పవన్ సినిమాలు రిలీజ్ అయితే.. అక్కడి అభిమానులు పండుగలా జరుపుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ చిత్రాలకు ఎప్పుడూ భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి.
1/6పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా.. ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో నిలబడి పలు విజయాలు సాధించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 28 సినిమాల్లో నటించారు. త్వరలో రాబోతున్న OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ కలిపి 30 సినిమాలు అవుతాయి.
2/6పవన్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, బాలు, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు ఆయన అభిమానులను అలరించాయి. అయితే వీటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం భీమ్లా నాయక్.
3/62022లో విడుదలైన భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, సంభాషణలు అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. థియేటర్లలో విడుదలైన తర్వాత రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా రూ.210 కోట్ల వరకూ వసూలు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా భీమ్లా నాయక్ పేరు నిలిచిపోయింది.
4/6తాజాగా పవన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం OG గురించి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సుజీత్ దర్శకత్వం వహించగా, థమన్ సంగీతం అందించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అమెరికాలో ముందుగానే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ రావడం విశేషం.
5/6ఇక హరిహర వీరమల్లు సినిమాను అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ ఆ చిత్రం ఊహించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. అది రూ.110 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. అయితే భీమ్లా నాయక్ మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో టాప్ గ్రాసర్‌గా నిలిచింది.
6/6ఇప్పుడు అందరి దృష్టి OG సినిమా మీదే ఉంది. ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో, భీమ్లా నాయక్ రికార్డు బద్దలు కొడుతుందో అనేది చూడాలి. ఏది జరిగినా పవర్ స్టార్ పేరు మాత్రం తెలుగు సినిమా చరిత్రలో.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.