Prabhas Movie: పాన్ ఇండియా పరంగా తనంటే ప్రత్యేక క్రేజ్ తెచ్చి పెట్టుకున్న హీరో ప్రభాస్. మరో పక్క పాన్ ఇండియా క్రేస్ లేకపోయినా తెలుగు రాష్ట్రాలలో.. టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరిద్దరికీ సంబంధించి ఒక సినిమా వస్తుందంటే ఇక అభిమానుల్లో ఆ ఉత్సాహం చెప్పనవసరం లేదు..
1/6పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులగా.. సినిమాలకన్నా ఎక్కువ పొలిటికల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ.. సినిమా పైన కూడా తన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమైన ఈ హీరోకి.. తాజాగా ఓజీ చిత్రం వల్ల కొంచెం ఉరట వచ్చింది.
2/6పవన్ కళ్యాణ్.. హీరోగా వచ్చిన ఓజి చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. కథతో సంబంధం లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఇచ్చి ఈ సినిమాకి మంచి హిట్ టాక్ తెచ్చి పెట్టుకున్నారు ఈ దర్శకుడు.
3/6ఈ విషయం పక్కన పెడితే ఈ దర్శకుడు గతంలో ప్రభాస్ తో సాహో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలను కలిపి సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ తీయబోతున్నారు అనే వార్త వినిపిస్తూనే ఉంది.
4/6అందుకు తగ్గట్టుగానే సుజిత్ కూడా ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేస్తాను అని గతంలో చెప్పాడు. ఇక ఓజీ సినిమాలో కూడా సాహూకి.. సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పెట్టారు.
5/6దీంతో ప్రస్తుతం ఒక కొత్త థియరీ వినిపిస్తోంది. అదేమిటి అంటే ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ కూతురుగా ఒక పాప కనిపిస్తుంది. ఇక ఆ పాపే పెద్దయి శ్రద్ధ కపూర్ అవుతుందని.. శ్రద్ధ కపూర్ ప్రభాస్ సాహో సినిమాలో హీరోయిన్ అని చెప్పుకొస్తున్నారు.
6/6ప్రస్తుతం ఓజీకి రెండో భాగం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అందులోనే పవన్ కళ్యాణ్ కూతురిని ప్రభాస్ హీరోయిన్గా చూపించబోతారు అని ఒక వార్త తెగ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదో తెలియాలి అంతే సుజిత్ క్లారిటీ ఇవ్వాల్సిందే.