Add Zee Business As A Preferred Source
App

HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ఏ సినిమా నుంచి పవర్ స్టార్ బిరుదు చేరింది.. ఇంతకీ ఈ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా.. !

Written ByTA Kiran Kumar
Published: Sep 02, 2025, 05:23 AM IST|Updated: Sep 02, 2025, 05:25 AM IST


Pawan Kalyan Power Star: పవన్ కళ్యాణ్ పేరు చెబితే ప్యాన్స్ కు  పూనకం. అంతేకాదు చిరంజీవి సోదరుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్.  అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదును ఎవరు ఇచ్చారు. ఏ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పేరు ముందు ఆ బిరుదు చేరిందనే విషయానికొస్తే..

Power Star Pawan Kalyan1/7

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan:  సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పాలి. 2024 వరకు ఈయన ఓ మాములు హీరో. జనసేన పార్టీ అధినేత. కానీ ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవ చేస్తున్నారు.   

 

Janasena 2/7

జనసేన

అన్నయ్య చిరంజీవి బాటలో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి లెగ్ పెట్డారు పవన్ కళ్యాణ్. అంతేకాదు అన్నయ్య ప్రజా రాజ్యం పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేస్తే.. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీతో గ్రాండ్ గా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. అన్న లాగా కాడి ఒదిలేయకుండా.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ఏపీలో బలీమైన శక్తిగా చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. 

Chiranjeevi - Pawan Kalyan 3/7

చిరంజీవి - పవన్ కళ్యాణ్

అయితే.. పవన్ కళ్యాణ్  అన్యయ్యకు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు  వచ్చి చేరింది. అప్పట్లో  2024 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావడం వెనక పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించి అసలు సిసలు పవర్ స్టార్ గా నిలిచారు.  అయితే సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ పేరు ‘కళ్యాణ్ కుమార్’.అంతేకాదు అంజనా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రాలకు సహ నిర్మాత కూడా. 

Pawan Kalyan 4/7

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ 1996లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్  తెరకెక్కించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు ‘కళ్యాణ్’ గానే ఉంటుంది. ఆ సినిమా సరిగా నడవలేదు. కొణిదెల కుటుంబం మొత్తం రామ భక్త హనుమాన్ స్వామి భక్తులు. అన్యయ్య ఆంజనేయ స్వామి  పేరు కలిసొచ్చేలా చిరంజీవి గా పేరు మార్చుకొని మెగాస్టార్ అయ్యారు. అదే రూట్లో కళ్యాణ్ బాబు.. అంజనా పుత్రుడి  పేరు కలిసొచ్చేలా కళ్యాణ్ పేరు ముందు ‘పవన్’ చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యారు. 

 

Gokulamlo Seetha 5/7

గోకులంలో సీత

అంతేకాదు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రెండో  చిత్రం ‘గోకులంలో సీత’ సినిమా నుంచి టైటిల్స్ లో పవన్ కళ్యాణ్ అని వేయడం మొదలు పెట్టారు. ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన ‘గోకులంలో సీతై’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు పోసాని కృష్ణ మురళి మాటలు అందించారు. 

Posani Krishna Murali 6/7

పోసాని కృష్ణమురళి

‘గోకులంలో సీత’ సక్సెస్ మీట్ లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను పవన్ స్టార్ అని పిలిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత పలు పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ పేరుతో కథనాలు రాసారు. 

Suswagatham 7/7

సుస్వాగతం

ఇక ‘గోకులంలో సీత’ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కిన ‘సుస్వాగతం’ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు వచ్చి చేరింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా వెనక్కి తిరిగి  చూసుకోలేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని  శాసించే స్థాయికి చేరుకున్నారు.