Add Zee Business As A Preferred Source
App

Udaya Bhanu: ఉదయభాను పైన మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఎందుకంటే..?

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Jun 09, 2025, 03:54 PM IST|Updated: Jun 09, 2025, 03:54 PM IST

Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి ఎన్నో అడ్డంకులు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రం..ఇప్పటికీ కూడా విడుదల కాలేదు.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది ఈ సినిమా..

Udaya Bhanu vs Pawan Kalyan Fans1/5

హరిహర వీరమల్లు

2020 సంవత్సరంలో మొదలైన.. హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ కూడా విడుదలకు నోచుకోలేదు. పవన్ కళ్యాణ్ సినిమా అయినప్పటికీ ఈ చిత్రంపై కనీస అంచనాలు కూడా లేకుండా మారింది పరిస్థితి. 

Hari Hara Veera Mallu Release Date2/5

హరిహర వీరమల్లు

ఇక ఈ చిత్రం ఈ నెలలో విడుదల కావలసి ఉండగా.. అది కూడా వాయిదా పడి వచ్చే నెలకు వెళ్ళింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.

Hari Hara Veera Mallu Event 3/5

హరిహర వీరమల్లు

అసలు విషయానికి వస్తే ఈ మధ్య హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్ కి ఉదయభాను యాంకర్ గా బాధ్యతలు వహించింది. 

Uday Bhanu Controversy at HHVM4/5

హరిహర వీరమల్లు

ఈ ఈవెంట్లో దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ఉన్నప్పుడు.. మధ్యలో ఉదయభాను.. “ఇదంతా చూస్తుంటే మాకు ఎందుకో..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడినట్టు అనుమానంగా ఉంది.. అవునా..,” అంటూ ఏమీ తెలియనట్టు అడిగింది ఉదయభాను.  

Udayabhanu At HHVM Event 5/5

హరిహర వీరమల్లు

దీంతో దర్శకుడు బిక్క మొహం వేశారు. ఈ చిత్రంలో.. మాట వినాలి అనే పాట పవన్ కళ్యాణ్ పాడగా ఆ పాట విడుదలై కూడా ఎన్నో రోజులవుతున్న సంగతి తెలిసిందే. అయినా కానీ ఉదయభాను ఇలా అడగడంతో.. ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు కూడా ఎవరి బుర్రకి ఎక్కలేదు అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్.. ఉదయభానుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.