Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan House Tour: పవన్ కళ్యాణ్ ఇంటిని చూతము రారండి.. రాజ భవనాన్ని మించిన ఏపీ డిప్యూటీ సీఎం ఇళ్లు..

Written ByTA Kiran Kumar
Published: Sep 02, 2025, 04:23 AM IST|Updated: Sep 02, 2025, 04:25 AM IST

Pawan Kalyan House inside pics: పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలిటిక్స్ తో పాటు మరోవైపు వీలు చూసుకొని సినిమాలు చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. పవన్ ఏపీలో  కర్మభూమిగా అక్కడ పనులు చూసుకుంటూనే హైదరాబాద్ నివాసం ఉంటున్నారు. పవర్ స్టార్ హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు కూడా ఇంద్రభవనం కూడా దిగదుడుపే అని ఆ ఫోటోలు చూస్తే చెప్పొచ్చు.  

Pawan Kalyan House inside pics1/5

పవన్ కళ్యాణ్ ఇన్ సైడ్ పిక్స్

Pawan Kalyan House inside pics: పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ గా చక్రం తిప్పుతున్నారు.  కథానాయకుడిగా కెరీర్  పీక్స్ లో  ఉండగానే..2014లో జనసేన పార్టీ స్థాపించారు. అంతేకాదు అప్పటి సార్వత్రిక  ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో  బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ప్రకటించారు. తాను ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 

Pawan Kalyan Prabhanjanam 2/5

పవన్ కళ్యాణ్ ప్రభంజనం

ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పొట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసాడు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు శాసన సభ  స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అలా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని పడిలేచిన కెరటంలా 2024 ఎన్నికల్లో సంచలనం రేపారు.  

Janasena 3/5

జనసేన

ఇక  2024 ఎలక్షన్స్ కు ముందే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనవ్వనని చెప్పి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలో కూటమిగా కలిసి పోటీ చేసి పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి సంచనల విజయం సాధించారు. రాజకీయాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో సక్సెస్ అందుకొని 100 శాతం స్ట్రెక్ రేట్ ఉన్న పార్టీగా సంచలనం రేపారు. . 

 

Pawan Kalyan 4/5

పవన్ కళ్యాణ్

ఆ సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో  పవన్ కళ్యాణ్  ఉంటున్న ఇంటికి సంబంధించిన  ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

Pawan Kalyan House 5/5

పవన్ కళ్యాణ్ ఇళ్లు

పెద్ద లాన్ కూడిన 6 వేల గజాల్లో  పవన్ కళ్యాణ్  ఇల్లు  జూబ్లీ హిల్స్ లో ఉంది. ఈ ఇంటి విలువ హైదరాబాద్  ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం  రూ. 30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఉంటుందనేది టాక్. మొత్తంగా గార్డెనింగ్ తో ఉన్న ఈ ఇల్లు  రాజ భవనాన్ని తలదన్నేలా  ఉంది.ఇందులో  ఓ స్మిమ్మింగ్ ఫూల్ తో పాటు పార్టీ మీటింగ్ కోసం హాల్, జిమ్ వంటి ఉన్నాయి.