Parvati melton baby bump pics viral: నటి పార్వతి మెల్టన్ పెళ్లైన 13 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె బేబీ బంప్ ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట రచ్చగా మారింది. దీనిపై నెటిజన్లు సెటైర్ లు వేస్తున్నారు.
1/6ఒకప్పుడు పెళ్లి వేడుకకు ముందు కొత్త జంట ఇద్దరు ఫోటోషూట్ లు చేసేవారు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి ఒక్క వేడుకను ఫోటో షూట్ చేస్తు రచ్చ చేస్తున్నారు. అసలు జనాలు ఏమనుకుంటారో అని కూడా ఏ మాత్రం ఆలోచించడంలేదు. ఇటీవల ప్రెగ్నెంట్, బేబీ బంప్ ఫోటో షూట్ చేయడం తెగ ట్రెండ్గా మారింది.
2/6ఈ క్రమంలో తాజాగా.. నటి పార్వతి మెల్టన్ బోల్డ్ బేబీ బంప్ ఫోటో షూట్ తో ప్రస్తుతం రచ్చ చేసింది. ఆమె తన ఇన్ స్టాలో తన బేబీ బంప్ ఫోటోల్ని అభిమానులతో పంచుకుంది. దీనిపై నెట్టింట ఆమెను కొంత మంది సెటైర్ లు వేస్తున్నారు.
3/6పార్వతి మెల్టన్ 2005 లో.. వెన్నెల చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన..జల్సాలో నటించింది. ఈ మూవీలో పవన్ చెప్పిన పంచ్ డైలాగ్ లు ఇప్పటికి కూడా అభిమానుల్ని పూనకాలు తెప్పిస్తున్నాయి.
4/6ఆ తర్వాత గేమ్, అల్లరే అల్లరి, మధుమాసం సినిమాలు నటించి మంచి క్రేజ్ సంపాదించింది. కానీ ఈ సినిమాలు ఒక రేంజ్ లో హిట్ కాకపోయిన నటికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో పార్వతి మెల్టన్ చేసింది. మరోవైపు.. ఈ భామ 2012 లో అమెరికాలో ఉన్న బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. సినిమాలు మానేసి అక్కడ బిజినెస్‌లలో బిజీ అయ్యిపోయింది.
5/6తాజాగా పార్వతి మెల్టన్ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి తర్వాత 13 ఏళ్లకు తొలిసారి తల్లికాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని నటి పోస్ట్ చేసింది. కొంత మంది ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
6/6కానీ మరికొంత మంది మాత్రం ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో ఆమె కెరిర్ ఒక్కసారిగా ఆగిపోవడం వెనుక కొంత మంది డైరెక్టర్ లు ఉన్నారని అప్పట్లో పుకార్లు హల్ చల్ చేశాయి. మరోవైపు ఈ బొల్డ్ బేబీ బంప్ షూట్ అవసరమా.. అంటూ కొంత మంది ఆమెపై సెటైర్ లు వేస్తున్నారు.