Pawan Kalyan Net Worth Details : అప్పుడే పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా.. ఫాన్స్ ముందు నుంచే ఆయన చిత్రాల రీ రిలీజ్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్ లో కూడా.. పవన్ కళ్యాణ్ పేరు తెగ ట్రెండ్ అవుతోంది.. ఈ క్రమంలో ఆయన ఆస్తుల వివరాలు ఎంతో ఒకసారి చూద్దాం..
1/5పవర్ స్టార్ అంటే విపరీతంగా అభిమానించే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అందుకే.. పవన్ కళ్యాణ్ కి అభిమానులు కాదు భక్తులు ఉంటారు అంటూ కూడా కామెంట్ల వినిపిస్తూ ఉంటాయి.
2/5ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన ఆస్తుల వివరాల గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం హీరో గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
3/5ఈ క్రమంలో గత సంవత్సరం ఎలక్షన్స్ లో పోటీ చేసే ముందుగా పవన్ కళ్యాణ్ ఆయన ఆస్తుల వివరాల గురించి బయటపెట్టారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆయనకు 164 కోట్ల ఆస్తి ఉన్నట్టు ధ్రువీకరించారు.
4/5అంతేకాకుండా ఈ హీరో రియల్ ఎస్టేట్లో కొన్ని పెట్టుబడులు పెట్టి ఉన్నారు. అలానే పవన్ కళ్యాణ్ కి కొన్ని లక్సరీ కార్లు ఇంకొంత బ్యాంకు డిపాజిట్ మనీ కూడా ఉంది. ఇక ఇవన్నీ కలిపి 65 కోట్ల వరకు ఉండొచ్చు అని అప్పట్లో తెలియజేశారు.
5/5ఇక పవన్ కళ్యాణ్ కార్ల విలువ దాదాపు 14 కోట్ల వరకు ఉండొచ్చు అని వినికిరి. ఇక ఈమధ్య ఒక్క సినిమాకి పవన్ కళ్యాణ్ 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్.. తీసుకుంటున్నారు.