Add Zee Business As A Preferred Source
App

OG 1st Day Premiers Collections Record: ‘ఓజీ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మరో సంచలన రికార్డు..

Written ByTA Kiran Kumar
Published: Sep 25, 2025, 10:09 PM IST|Updated: Sep 25, 2025, 10:09 PM IST

OG 1st Day Premiers Collections Record:: పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గ సబ్జెక్ట్ పడితే ఎలా ఉంటుందనేది మరోసారి ‘ఓజీ’ మూవీతో ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

1/5

OG 1st Day Premiers Collections Record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాలను గమనిస్తే.. హరి హర వీరమల్లు తప్పించి మిగతా అన్ని చిత్రాలు రీమేక్ సినిమాలు కావడం గమనార్హం. ‘హరి హర వీరమల్లు’ సినిమా స్టోరీ బాగానే ఉన్నా.. ట్రీట్మెమెంట్ సరిగా లేకపోవడంతో ఈ చిత్రం పవన్ అభిమానులను సైతం మెప్పించలేకపోయింది.

OG 2/5

ఓజీ

తాజాగా సుజిత్ దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విషయానికొస్తే.. ఇది పవన్ కళ్యాణ్ నటించిన డైరెక్ట్ స్టోరీ కావడం గమనార్హం. 1990ల నాటి అప్పటి బాంబే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. 

Pawan Kalyan as don 3/5

పవన్ కళ్యాణ్ డాన్ క్యారెక్టర్

పవన్ కళ్యాణ్ ‘బాలూ’, ‘పంజా’ తర్వాత ‘ఓజీ’లో గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాపై ఉన్న అంచనాలతో ఎక్కువ రేట్ ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా టికెట్ కొనుక్కుని మరి చూసారు. మరి ‘ఓజీ’ (The Call Him OG) సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ ఫస్ట్ డే కలిపి రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

OG First Day Box Office Collections 4/5

ఓజీ ఫస్ట్ డే నే బాక్సాఫీస్ కలెక్షన్స్

ఫస్ట్ డే నే బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ముందే రోజే ప్రీమియర్స్ ద్వారా రూ. 25 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోబోతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 4 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల నుంచి రూ. 21 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. 

OG Premiers records5/5

ఓజీ ప్రీమియర్స్ రికార్డ్స్

హరి హర వీరమల్లు, పుష్ప 2 ప్రీమియర్స్ కలెక్షన్స్  రికార్డ్స్ ను బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.5 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే అమెరికాలో దాదాపు 3.1 మిలియన్స్ క్రాస్ చేసింది. మొత్తంగా ఫైనల్ లెక్కలు చూసుకుంటే రూ. 125 కోట్ల గ్రాస్ నుంచి రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. ఫైనల్ లెక్కలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి.