Add Zee Business As A Preferred Source
App

OG Hindi Box Collections:‘ఓజీ’ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరిస్థితి ఏంటి.. షాక్ కు గురి చేస్తోన్న వసూళ్లు..!

Written ByTA Kiran Kumar
Published: Sep 29, 2025, 06:23 AM IST|Updated: Sep 29, 2025, 06:25 AM IST

OG Hindi Box Collections: ‘బాహుబలి’ సిరీస్ తో తెలుగు సహా అన్ని చిత్రాలకు  సినిమాలకు  ప్యాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది. ఇక మన దేశంలో తెలుగు సినిమాలే ఎక్కువగా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ వసూళ్లు ఎలా ఉన్నాయంటే.. 

 

OG Hindi Box Collections1/5

ఓజీ హిందీ కలెక్షన్స్

OG Hindi Box Collections: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా తొలిసారి హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించ లేకపోయింది. కానీ ‘ఓజీ’ మూవీని ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో విడుదల చేశారు. 

OG 2/5

ఓజీ

‘ఓజీ’ మూవీ హిందీలో ఫస్ట్ డే రూ. 50 లక్షల నెట్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో శుక్రవారం రూ. 40 లక్షలు నెట్ వసూళ్లు.. మూడో రోజు రూ. 55 లక్షల నెట్ వసూళ్లను కొల్లగొట్టింది. నాల్గో రోజు దాదాపు అదే రేంజ్ లో రూ. 60 లక్షల నెట్ వసూళ్లను దక్కించుకుంది. 

ఓజీ హిందీ వసూళ్లు 3/5

OG Hindi Collections

ఓవరాల్ గా నాలుగు రోజుల్లో రూ. 2 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా లాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన ‘ఓజీ’కి అక్కడ మల్టీప్లెక్స్ లో కాకుండా కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో విడుదల చేసారు. అయినా.. ఉన్నంతలో మంచి గ్రోత్ ను చూపిస్తోంది. ఓ రకంగా మిగతా హీరోల సినిమాలతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. 

OG Hindi 4/5

ఓజీ హిందీ

హిందీలో జోరుగా ప్రచారం చేసి ఉంటే కలెక్షన్స్ ఇంకాస్త ఎక్కువగా వచ్చేవి. సినిమాలో మాస్ కంటెంట్ దృష్ట్యా ఉత్తరాది ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్న ప్రమోషన్స్ విషయంలో వీక్ ఉండటం  ‘ఓజీ’కి మైనస్ గా మారిందనే చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి. 

 

OG Overseases Tsunami 5/5

ఓజీ ఓవర్సీస్ సునామి

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ మూవీ హిందీలో కాకుండా తెలుగులో ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్ల సునామీ కురిపిస్తోంది. దసరా అడ్వాంటేజ్ తో ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.