Add Zee Business As A Preferred Source
App

OG Box Office Report: ‘ఓజీ’ ఓవరాల్ గా హిట్.. తెలుగు రాష్ట్రాల్లో నష్టాల పాలైన బయ్యర్స్..

Written ByTA Kiran Kumar
Published: Oct 10, 2025, 05:25 AM IST|Updated: Oct 10, 2025, 05:25 AM IST

OG Box Office Report: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్  తెచ్చుకుంది. అంతేకాదు ఓవరాల్ గా 12 యేళ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా బయ్యర్స్  కు నష్టాలు మిగుల్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

OG Box Office Report1/7

ఓజీ బాక్సాఫీస్ రిపోర్ట్

OG Box Office Report: తెలుగు బాక్సాఫీస్ దగ్గర యువ హీరోల్లో అసలు సిసలు బాక్సాఫీస్  క్లౌడ్ పుల్లర్ గా పవన్ కళ్యాణ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన్ని అభిమానులు హీరోగా కాకుండా దేవుడాగా కొలిచే అభిమానులున్నారు.  తాజాగా ‘ఓజీ’ మూవీ భారీ హైప్ నడుమ విడుదలై 12 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని పవన్ ఖాతాలో క్లీన్ హిట్ గా నిలిచింది. 

Pawan Kalyan 2/7

పవన్ కళ్యాణ్

ఓజీ’ మూవీ విడుదలై తొలి రోజే..రూ. 154 కోట్ల గ్రాస్ వసూల్లతో సంచలనం రేపింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలి రోజే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ముందుగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేద్దామని ప్లాన చేసారు. కానీ లిమిటెడ్ గా విడుదల చేయాల్సి వచ్చింది. ‘ఓజీ’ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు తిరగరాసింది. 

OG 3/7

ఓజీ

‘ఓజీ’ మూవీ పవన్ కెరీర్ లోనే తొలి రోజు వంద కోట్ల గ్రాస్ పైగా వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు పవన్ కెరీర్ లో తొలి రూ. 100 కోట్ల షేర్.. తొలి రూ. 150 కోట్లు..రూ. 175 కోట్ల షేర్ తో సంచలనం రేపింది. ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

 

OG Break Even 4/7

ఓజీ బ్రేక్ ఈవెన్

రూ. 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి ఇప్పటి వరకు రూ. 178 కోట్ల షేర్ (రూ.294 కోట్ల గ్రాస్) వసూల్లతో సంచలనం రేపింది. ఈ యేడాది ‘సంక్రాంతికి వస్తున్నం’ సినిమా అత్యధిక వసూళ్లను క్రాస్ చేసి తెలుగులో ఎక్కవ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. 

OG Overseas Collections 5/7

ఓజీ’ ఓవర్సీస్ కలెక్షన్స్

‘ఓజీ’ సినిమాకు ఓవర్సీస్ కలెక్షన్స్ పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. అక్కడ ఈ చిత్రాన్ని రూ. 17.50 కోట్ల బిజినెస్ కు గాను రూ. 32 కోట్ల షేర్ రాబట్టి దాదాపు డబుల్ లాభాలను అందించింది. అక్కడ $5.52 మిలియన్ డాలర్స్ రాబట్ట సంచలనం రేపింది. మరోవైపు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఓవరాల్ గా రూ. 15 కోట్ల షేర్ రాబట్టి దాదాపు రూ. 5 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. 

OG Telugu States Business6/7

ఓజీ తెలుగు రాష్ట్రాల బిజినెస్

అదే తెలంగాణలో ‘ఓజీ’ మూవీ రూ. 54 కోట్ల రికార్డు బిజినెస్ చేస్తే.. రూ. 51 కోట్లు మాత్రమే రాబట్టి బయ్యర్స్ కు రూ. 3 కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చింది. రాయలసీమలో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అక్కడ రూ. 18 కోట్ల షేర్ రాబట్టి రూ. 4 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 69 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు గాను రూ. 61 కోట్ల వచ్చాయి. అక్కడ రూ. 8 కోట్ల లాస్ ను నమోదు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల నష్టాలను బయ్యర్స్ కు మిగుల్చింది. ఓవర్సీస్ + కర్ణాటకలో కలిపి రూ. 18 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3 కోట్ల లాభాలతో హిట్ స్టేటస్ అందుకుంది. 

Pawan Kalyan 7/7

పవన్ కళ్యాణ్

ఓ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రేటు పెట్డడం వల్ల ఈ నష్టాలు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మిక్స్ డ్ టాక్ తో  ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం  కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వసూల్లు హీరోగా పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాను చెబుతున్నాయి. ఏది ఏమైనా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ హిట్ అందుకోవడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇతరత్రా అన్ని కలిపి ఈ సినిమాతో నిర్మాత భారీ లాభాలను అందుకోవడం విశేషం.