Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan Remunaration:‘ఓజీ’ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..! మైండ్ బ్లాంక్ అంతే..

Written ByTA Kiran Kumar
Published: Sep 26, 2025, 08:01 AM IST|Updated: Sep 26, 2025, 08:01 AM IST

Pawan Kalyan Remunaration: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేయగా.. తాజాగా ‘ఓజీ’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. 

Pawan Kalyan Remunaration1/6

పవన్ కళ్యాణ్ పారితోషకం

Pawan Kalyan Remunaration: ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం తన పారితోషికాన్ని త్యాగం చేసినట్టు నిర్మాత ఏ.ఎం.రత్నం చెప్పారు. అంతేకాదు ఆ సినిమా కోసం ఎన్నడు లేనట్టుగా వరుసగా ప్రెస్ మీట్స్ కూడా పెట్టి నిర్మాతలను ఆదుకునే ప్రయత్నం చేసారనేది పవన్ అభిమానులు చెబుతున్న మాట. 

 

OG Collections 2/6

OG కలెక్షన్స్

మరోవైపు ‘ఓజీ’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చేతిలో పవర్ ఉండటంతో అభిమానుల మొదటి రోజు చూడాలనే ఆతృతను క్యాష్ చేసుకోవడానికి ఈ చిత్రానికి ప్రీమియర్స్ తో పాటు మొదటి పది రోజులు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇప్పించుకున్నారనేది ప్రత్యర్థి పార్టీలు చెబుతున్న మాట. 

Pawan Kalyan 3/6

పవన్ కళ్యాణ్

తాను తీసుకున్న పారితోషికం తో పాటు నిర్మాతలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులపై పవన్ కళ్యాణ్ మోయలేని భారాన్ని వేసారని చెబుతున్నారు నెటిజన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం.. మా సినిమా మా ఇష్టం మీ నచ్చితే చూడండి.. నచ్చకపోతే చూడకండి అని ఖరాఖండీగా చెబుతున్నారు. మా అభిమాన హీరో సినిమాను ఎంత పెట్టైన మేము చూస్తామని తెగేసి చెబుతున్నారు. ఇదే నిర్మాతలకు వరంగా మారింది. 

OG Premiers 4/6

ఓజీ ప్రీమియర్స్

అందుకే ఈ సినిమా ప్రీమియర్స్ ఏపీలో రూ. 1000, తెలంగాణలో రూ. 800 కు అమ్మారు. ఈ ప్రీమియర్స్ టికెట్ రేట్స్ ను అంతకంటే ఎక్కువగా రూ. 2500 నుంచి రూ. 3000 మధ్య బ్లాక్ లో  విక్రయించారు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు. అలా అభిమానుల అత్యుత్సాహాన్ని భారీగా క్యాష్ చేసుకున్నారు. ఇందులో ఎవరిని నిందించాల్సిన పనిలేదు. చూసేవాళ్లుంటే.. అమ్మేవాళ్లు లుంటారనే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఈ సినిమాను కొన్నవాళ్లు డబ్బులు చేసుకున్నారు. ఇందులో ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. 

Pawan 100 Crore Remunaration 5/6

పవన్ రూ. 100 కోట్లకు పైగా పారితోషికం

మరోవైపు ‘ఓజీ’ సినిమా కోసం  పవన్ కళ్యాణ్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్టు చెబుతున్నారు. రూ. 250 కోట్ల బడ్జెట్ లో సగం బడ్జెట్ లో అటు ఇటుగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కే పోయింది. ఈ సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కు రూ. 2 కోట్లు.. ఇమ్రాన్ హష్మికి రూ. 5 కోట్లు.. సుజిత్ కు రూ. 8 కోట్లు.. తమన్ కు రూ. 5 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా కోసం పనిచేసిన అందరి రెమ్యునరేషన్స్ కలిపినా.. పవన్ కళ్యాణ్ పారితోషికంలో సగం కూడా ఉండదు.

Pawan Kalyan Cut out 6/6

పవన్ కళ్యాణ్ కటౌట్

అయితే.. ‘ఓజీ’  సినిమాను పవన్ కళ్యాణ్ కటౌట్ చూసే థియేటర్స్ కు వస్తున్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ కు రూ. 100 కోట్లు ఇచ్చిన తక్కువే అంటున్నారు ఆయన అభిమానులు. సినిమా ఇండస్ట్రీ అయినా.. ఎక్కడైనా.. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా వాళ్ల పారితోషికాలు నిర్ణయించబడుతాయి. ఇందులో ఎవరికి నిందించాల్సిన పనిలేదనే వాదన వినిపిస్తోంది.