Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan Vs Putin: ఫవన్ కళ్యాణ్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉన్న ఈ సంబంధం తెలిస్తే షాక్ అవుతారు..!

Written ByTA Kiran Kumar
Published: Sep 03, 2025, 01:01 PM IST|Updated: Sep 03, 2025, 01:10 PM IST

Pawan Kalyan Vs Putin: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అటు రష్యాను ఏకచ్ఛత్రాధి పథ్యంగా పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  వీళ్లిద్దరి మధ్య ఓ చిత్రమైన రిలేషన్ ఉంది. 

 

Pawan Kalyan Vs Putin1/7

పవన్ కళ్యాణ్ వర్సెస్ వ్లాదిమర్ పుతిన్

Pawan Kalyan Vs Putin: పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా తెరంగేట్రం చేసి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు జనసేన అధినేతగా ఎన్నో ధక్కా మొక్కీలు తిని గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాదు.. ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. 

Putin - Pawan 2/7

పుతిన్ - పవన్

వ్లాదిమిర్ పుతిన్ విషయానికొస్తే.. యంగ్ ఏజ్ లో రష్యా గూఢచార వ్యవస్థ అయిన కేజీబీలో పనిచేశారు. అంతేకాదు ఆయన కళ్ల ముందే 1990 దశకంలో గోర్బెచెవ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  రష్యా ముక్కచెక్కలైంది. 

 

USSR 3/7

యూఎస్ఎస్ఆర్

అయితే మునుపటి యూఎస్ఎస్ఆర్ ను తిరిగి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో పుతిన్ అధ్యక్షుడు అయ్యాడు. అంతేకాదు ప్రపంచ అగ్ర నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీళ్లిద్దరికి ఓ రిలేషన్ ఉందట. 

Pawan Kalyan - Vladimir Putin 4/7

పవన్ కళ్యాణ్ - వ్లాదిమర్ పుతిన్

పవన్ కళ్యాణ్ మూడో సతీమణికి అన్నా లెజ్నెవాకు  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు దూరపు చుట్టరికం ఉందట. వీళ్ల కుటుంబాల మధ్య మంచి రిలేషన్ కూడా ఉందనేది టాక్.   అంతేకాదు ఈమె సినిమాల్లో రాకముందు  రష్యన్ మోడల్ గా పనిచేసింది.  1980లో పుట్టిన ఈమె పలు సౌత్ సినిమాల్లో నటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్ మార్ సినిమాలో యాక్ట్ చేసింది.  

Teenmaar5/7

తీన్ మార్

‘తీన్ మార్’ సినిమా నుంచే పవన్, అన్నాలెజ్నోవా మధ్య   మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో అన్నా లెజ్నోవాను పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నారు. మధ్యలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు పుకార్లు షికార్లు చేశాయి.

Mark Shankar 6/7

మార్క్ శంకర్ పవనోవిచ్

వీళ్లకు 2017లో కుమారుడు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు.  అన్నా లెజ్నెవా అప్పటికే వివాహాం జరిగింది. మొదటి భర్తతో విడాకుల తర్వాత అన్నాలెజ్నోవాకు పవన్ కళ్యాణ్ తో రెండో పెళ్లి జరిగింది. అటు పవన్ కళ్యాన్  కు ఇది మూడో వివాహాం. వీరికో పాప ఉంది ఆమె పేరు అంజనా పాప్నోవా. 

Anna Lezhneva7/7

అన్నా లెజ్నెవా

అన్నా లెజ్నెవాకు రష్యాలో మంచి ధనవంతులున్న ఫ్యామిలీ.  ఓ వైపు మోడలింగ్.. చిత్రాలు.. వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు పలు హోటల్స్  వంటివి ఉన్నాయి. అన్నా లెజ్నోవా ఆస్తుల విలువ దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఉందనే ప్రచారం జరుగుతోంది.