Petrol Diesel Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు నవంబర్ 16వ తేదీ పెట్రోల్ , డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?


Petrol Diesel Price Today:  నేడు నవంబర్ 16వ తేదీ ఆదివారం ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి. 

1 /7

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్నాళ్లుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ. 2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వాహనదారులు కొంత ఆందోళనకు గురయ్యారు. కానీ పెరిగిన, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.   

2 /7

పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదంటూ స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయంటూ పేర్కొంది. దీంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే ప్రతినెలా ఒకటో తేదీన వీటి ధరల్లో మార్పులు జరుగుతాయోమోనని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ ఈ నెలల కూడా ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 16వ తేదీ ఆదవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

3 /7

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 పైసలు ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.02 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 96.585 పైసలు ఉంది.

4 /7

న్యూఢిల్లీ పెట్రోల్ రూ. 94.72, డీజిల్ రూ. 87.62, ముంబై పెట్రోల్ రూ. 104.21, డీజిల్ రూ. 92.15, కోల్‌కతా పెట్రోల్ రూ. 103.94, డీజిల్ రూ. 90.76గా ఉన్నాయి.   

5 /7

పెట్రోల్,  డీజిల్ ప్రధానంగా ముడి చమురు నుండి ఉత్పత్తి అవుతాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, ఇది భారత మార్కెట్‌ను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది.

6 /7

భారతదేశం తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. దానిని డాలర్లలో కొనుగోలు చేస్తుంది. రూపాయి బలహీనపడితే, ఇంధనం మరింత ఖరీదైనది అవుతుంది.

7 /7

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై భారీ పన్నులు విధిస్తాయి, ఇవి రిటైల్ ధరలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటాయి. అందుకే ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.ముడి చమురును శుద్ధి చేయడం కూడా ఖర్చులను కలిగి ఉంటుంది. ఇది ముడి చమురు నాణ్యత, శుద్ధి కర్మాగారం సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.