PF Balance: పీఎఫ్‌ బ్యాలెన్స్‌ నిమిషాల్లో ఈ 4 విధాలుగా చెక్‌ చేసుకోండి..!

Check PF Balance In  4 Ways: ఈపీఎఫ్ఓ సభ్యులకు బిగ్ అప్‌డేట్. మీరు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా మరో నాలుగు విధాలుగా కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. కేవలం నిమిషాల్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.. 
 

1 /5

 మిస్ కాల్..  మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే కేవలం ఒక మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది. అయితే దీనికి ముందుగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) మీ మొబైల్ నెంబర్ కి లింక్ అయి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఒక మిస్ కాల్ ఇస్తే మీ కంటి ముందు మీ పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. 

2 /5

ఫోన్ నెంబర్.. కేవలం మిస్ కాల్ మాత్రమే కాదు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 996604425 నెంబర్‌కు కాల్ చేసినా కానీ మీరు సులభంగా కొన్ని సెకన్లను మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌కు ఒక ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా మీరు ఫోన్ చేయగానే డిస్ కనెక్ట్ అయిపోయి మెసేజ్ వస్తుంది.

3 /5

ఎస్ఎంఎస్..  కేవలం మిస్ కాల్ ఫోన్ కాల్ మాత్రమే కాదు సింపుల్‌గా ఎస్ఎంఎస్ రూపంలో కూడా మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. ఇది కేవలం యుఏఎన్ మొబైల్ నెంబర్ కు లింక్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. EPFOHO UAN ENG అని 7738299899 నెంబర్ కి మెసేజ్ పంపాలి .

4 /5

 ఇక్కడ మీకు కావాలంటే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కి బదులుగా హిందీ లేదా తెలుగు కూడా టైప్ చేసుకోవచ్చు. మీ కంటి ముందు మీ పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా సాధారణంగా చెక్ చేసుకునే ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్లో కూడా మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు  

5 /5

 కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్‌ యాప్‌ కూడా ప్రవేశపెట్టింది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవుతే మీ పిఎఫ్ పాస్‌బుక్ కనిపిస్తుంది. అక్కడ మీరు క్లెయిమ్‌ స్టేటస్, సర్వీస్ హిస్టరీ వంటివి కూడా సులభంగా ఏ టైంలో అయినా చెక్ చేసుకోవచ్చు. కేవలం నిమిషాల్లో ఈ పని జరిగిపోతుంది.