Add Zee Business As A Preferred Source
App

Munawar Faruqui: బిగ్‌బాస్ విన్నర్‌ హత్యకు భారీ స్కెచ్.. కొంచెంలో మిస్.. ఎందుకు చంపాలనుకున్నారో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Oct 02, 2025, 09:38 PM IST|Updated: Oct 02, 2025, 09:38 PM IST

Bigboss Winner Munawar Faruqui Murder Plan: హిందీ బిగ్‌బాస్ షో సీజన్ 17, 2024లో విన్నర్‌గా నిలిచిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూకీని హత్య చేయాలని ఒక గ్యాంగ్ కుట్ర చేయగా.. వారి ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు విఫలం చేశారు. రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్, విరేంద్ర చరణ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్ నుండి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

comedian Munawar Faruqui1/5

బిగ్‌బాస్ విన్నర్‌ హత్యకు భారీ స్కెచ్

మునావర్ ఫారూకీ 2024లో బిగ్ బాస్ హిందీ షోలో విజేతగా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 14.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. గత ఏడాది నుంచి అతని ప్రాణానికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. లారెన్స్ బిష్నోయ్ హిట్‌లిస్ట్‌లో ఫారూకీ పేరు ఉంది.  

comedian Munawar Faruqui2/5

మునావర్ ఫారూకీ

ఫారూకీ తన షోల్లో చేసే కామెంట్ల వల్ల ఎల్లప్పుడూ అతడిని వివాదాలు చుట్టుముడుతుంటాయి. నాలుగేళ్ల క్రితం ఓ కేసులో అతడు 35 రోజుల జైలులో ఉన్నాడు. గతంలో ఫారూకీ హైదరాబాద్‌లోనూ షో నిర్వహించాలని అనుకున్నాడు. అప్పట్లో ఫారూకీ ఇక్కడ షో చేస్తే ఊరుకోబోమంటూ రాజాసింగ్ కూడా హెచ్చరించాడు.  

comedian Munawar Faruqui3/5

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూకీ హత్యకు కుట్ర

జైతుపూర్-కలిందీ కుంజ్ రోడ్‌లో హత్యకు స్కెచ్ వేసిన గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. వీరిని హరియాణా రాష్ట్రంలోని పాణిపత్, భివాని ప్రాంతాలకు చెందిన రాహుల్, సాహిల్‌గా పోలీసులు గుర్తించామన్నారు. కాల్పుల్లో రాహుల్‌కు గాయాలయ్యాయని తెలిపారు. 2024 డిసెంబర్‌లో హరియాణా యమునానగర్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్‌కి సంబంధించి వాటెండ్‌ లిస్టులో అతడు ఉన్నాడని అధికారులు తెలిపారు.  

Munawar Faruqui4/5

మునావర్ ఫారూకీ హత్యకు కుట్ర

ఈ ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో ఉన్న రోహిత్ గోదారా సూచనల ప్రకారం గోల్డీ బ్రార్, విరేంద్ర చరణ్‌తో కలిసి ఫారూకీని హతమార్చాలని కుట్ర పన్నారు. ఈ గ్యాంగ్ సభ్యులు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో ఫారూకీ మూవ్‌మెంట్స్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.  

Bigboss Winner Murder Plan5/5

మునావర్ ఫారూకీ హత్యకు కుట్ర

మునావర్ ఫారూకీకి రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులు లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే హిందూ దేవతలపై ఫారూకీ వేసే జోక్స్ ఆ కమ్యూనిటీ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు చెబుతున్నారు.