PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడుత నిధులు విడుదల.. లబ్ధిదారుల జాబితా ఇలా చెక్‌ చేయండి..

PM Kisan Check Beneficiary Status: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) 20 విడత నిధులు ఈరోజు రేపో విడుదల కానున్నాయి. అయితే ప్రధానంగా 20వ తేదీనే శుక్రవారం విడుదల చేస్తారు అని సమాచారం. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్ రేపు సందర్శనించనున్నారు. అక్కడే ప్రధానమంత్రి నిధులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా ఇలా చెక్ చేసుకోండి..
 

1 /5

2025 ఫిబ్రవరి 24వ తేదీ 19వ విడుద నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో 9.8 కోట్లకు మంది పైగా రైతులు లబ్ది పొందారు. ప్రస్తుతం 20వ విడత నిధులు ఈరోజు విడుదల కానున్నాయని సమాచారం ఉంది. అయితే ప్రభుత్వం అధికారికంగా ఇంకా సమాచారం ఇవ్వలేదు.  

2 /5

 పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతులకు ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు మంజూరు అవుతాయి. అలా ఇప్పటివరకు 19 విడుదల నిధులు మంజూరు చేశారు. దీనివల్ల కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు.  

3 /5

 పీఎం కిసాన్ నిధి యోజన పథకంలో మీ పేరు కూడా ఉందా ఎలా బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసే సదుపాయం కూడా కల్పించారు. https://pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేసి అందులో బెనిఫిషియరీ లిస్ట్ జాబితా అని ఎంపిక చేసుకోండి. అందులో ఫార్మర్ కార్నర్ సెక్షన్లో మీ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్, బ్లాక్‌, గ్రామం పేరు నమోదు చేయాలి.  

4 /5

అయితే ఈ పథకం నుంచి లబ్ది పొందాలంటే ఈ కేవైసీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం 20,000 మందికిపైగా రైతులను ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేసింది. అయితే రేపు పీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ సందర్శించనున్నారు. అక్కడ 20వ విడత నిధులు మంజూరు చేయనున్నారు.  

5 /5

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన లబ్ధి పొందడానికి మీ పేరు ముందుగానే నమోదు చేయాలి దీనికి బ్యాంక్, ఆధార్ లింక్ చేయాలి. ఇక పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ అయినా 155261 లేదా 01124300606 నెంబర్ కి కాల్ చేసి ఇతర వివరాలు పొందవచ్చు. లేదా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్లో కూడా వివరాలు ఉంటాయి.