Add Zee Business As A Preferred Source
App

PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్‌ అప్‌డేట్‌.. 21వ విడుత నిధులు నవంబర్‌ ఆ తేదీనే విడుదల, ఇదిగో క్లారిటీ..!

Written ByRenuka Godugu
Published: Oct 28, 2025, 09:42 AM IST|Updated: Oct 28, 2025, 09:42 AM IST

PM Kisan 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ప్రస్తుతం 21వ విడుదల నిధుల కోసం వాళ్ళు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 మూడు విడుతల్లో ఈ నిధులు విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 21వ విడుదలపై బిగ్ అప్‌డేట్ వచ్చింది.
 

21 st Installment1/5

21వ విడుత

 పీఎం కిసాన్ 21వ విడుత నిధుల కోసం రైతుల ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 20 విడుదల నిధులు మంజూరు చేశారు. అయితే దీపావళి లేదా ఛత్‌ పూజ సందర్భంగా పీఎం కిసాన్ నిధులు విడుదల అవుతాయని రైతుల ఎదురు చూశారు.  

Central govt2/5

కేంద్ర ప్రభుత్వం

 అయితే పీఎం కిసాన్ 21వ నిధులు నవంబర్ నెలలో మంజూరు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 21వ విధులు విడుదల కోసం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు . అయితే ప్రతి నాలుగు నెలలుకోసారి రూ.2000 చొప్పున విడుదల చేస్తుంది.  

November First Week3/5

నవంబర్ మొదటి వారం

నవంబర్ మొదటి వారంలోనే పీఎం కిసాన్ 21వ విడత నిధులు మంజూరు కానున్నట్లు సమాచారం. బీహర్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిధులు విడుదలవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు.  

Pradhana Mantri4/5

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌

అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి నిధులు పొందాలంటే ఈ కేవైసీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. దీనికి pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్లో మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లో కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోండి ఆన్లైన్ లో కూడా కేవైసీ పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది.  

PM Kisan5/5

పీఎం కిసాన్

ఇక పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇదే అధికారిక వెబ్సైట్లో మీరు మీ రాష్ట్రం, జిల్లా, బ్లాకు, గ్రామం పేరు నమోదు చేసి 'గెట్ రిపోర్ట్స్' పై క్లిక్ చేస్తే బెనిఫిషరీ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఏదైనా సహాయం పొందాలంటే హెల్ప్ లైన్ నెంబర్‌ 155261 సమాచారం అందించవచ్చు