Add Zee Business As A Preferred Source
App

PM Kisan Yojana: రైతులకు బిగ్‌ షాక్‌.. వీళ్లకు పీఎం కిసాన్ 21వ విడుత నిధులు పడవు..!

Written ByRenuka Godugu
Published: Oct 02, 2025, 11:27 AM IST|Updated: Oct 02, 2025, 11:27 AM IST

PM Kisan Yojana 21st Installment: పీఎం కిసాన్ నిధులు దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 21వ విడుదల నిధుల కోసం వారు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ రూ.2000 నిధులు ఈ రైతులు పొందలేరు. ఎందుకు ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
 

Direct Benefit Transfer1/5

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా రూ.2000 రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ అవుతాయి. ప్రతి ఏడాది మూడు విడతల్లో ఈ నిధులు మంజూరు చేస్తారు. అది మొత్తంగా రూ.6000 రైతులు ఖాతాలో జమవుతున్నాయి. ప్రస్తుతం 21వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.  

PM Kisan Cash2/5

పీఎం కిసాన్‌ నిధులు

 అయితే పీఎం కిసాన్‌ నిధులు 20వ విడుత ఆగస్టు రెండో తేదీ విడుదల చేశారు. 9 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. సెప్టెంబర్ 26న పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రైతులకు నిధులు ముందుగా విడుదల చేశారు. ప్రధానంగా వాళ్లు వరద బాధితులు ఎక్కువగా ఉండటంతో విడుదల చేశారు.   

Diwali3/5

దీపావళి

 అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులు 21వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు విడుదల చేస్తారు. రూ.2000 నిధులు దీపావళికి ముందుగానే విడుదల చేస్తారు అనుకున్నారు. కానీ నవంబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.   

EKYC4/5

ఈ కేవైసీ

 అయితే ఈ కేవైసీ పూర్తి కానీ రైతులకు నిధులు క్రెడిట్ కావు. ముందుగానే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. అప్పుడే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు క్రెడిట్ అవుతాయి. భూ రికార్డులు కూడా సరిగ్గా ఉండేలా చూసుకోండి.  

PM Kisan5/5

పీఎం కిసాన్‌

పీఎం కిసాన్‌ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌లైన్లో స్టేటస్ చెక్‌ కూడా చేసుకోవచ్చు. PMkisan.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ నిధులు క్రెడిట్ అయ్యాయా లేదా తెలుసుకోవచ్చు.