Add Zee Business As A Preferred Source
App

PM Modi at 75: భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలో అరుదైన ఘట్టాలు.. ఆయన రేర్ పిక్స్..

Written ByTA Kiran Kumar
Published: Sep 17, 2025, 12:09 AM IST|Updated: Sep 17, 2025, 12:10 AM IST

PM Narendra Modi at 75 Years: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీకి జాతీయ, అంతర్జాతీయ నేతలు, భారత ప్రజలు  స్వయంగా  ఎక్కువ మంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనకు జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఆయన అరుదైన చిత్రాలతో ప్రత్యేక కథనం..

PM Narendra Modi at 75 Years1/7

75వ యేట అడుగుపెట్టిన ప్రదాని మంత్రి

PM Narendra Modi at 75 Years: నరేంద్ర మోడీ మన దేశంలో  స్వాతంత్రం వచ్చాకా  మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా మోడీ రికార్డు నెలకొల్పారు. మోడీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల విషయానికొస్తే.. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వన్ అండ్ ఓన్లీ  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

 

Namo Education 2/7

నరేంద్ర మోడీ చదువు

నరేంద్ర మోడీ 1978లో రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసారు. అంతేకాదు 1982లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.1975 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించి ఎమర్జన్సీ పై గుజరాతి భాషలో ‘బుక్ ఆన్ ఎమర్జన్సీ’ పుస్తకం రాశారు. 2014లో భారత ప్రధాన మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో టైమ్ మ్యాగజైన్,  ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో  చేరారు. అంతేకాదు "పర్సన్ ఆఫ్ ది ఇయర్"లో PM మోడీకి 15వ స్థానం లభించింది.

Modi Social Media 3/7

మోడీ సోషల్ మీడియా రికార్డు

ఈయనకు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో  109 మిలియన్లకు పైగా ఫాలోవర్స్స్ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 97.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రెండు మాధ్యమాల్లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న నేతగా రికార్డు క్రియేట్ చేశారు. 

PM Modi Records 4/7

ప్రధాన మంత్రిగా రికార్డు

ప్రధాన మంత్రిగా 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈయన కంటే ముందు ఇందిరా గాంధీ 4077 రోజులు ప్రధానిగా సేవలు అందించారు. ఇందిరా గాంధీ.. 24-1-1966 నుంచి 24-3-1977 వరకు ప్రధానిగా సేవలు అందించారు. ఇక నరేంద్ర మోడీ ప్రధాని మంత్రిగా 26 మే 20214లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.నరేంద్ర మోడీ 2014, 2019,2024 వరుసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయ తీరాలకు చేర్చిన తొలి కాంగ్రెస్ యేతర నేతగా ప్రధానిగా చరిత్ర తిరగరాసారు. 

PM Modi Vivekananda 5/7

PM మోడీ స్వామి వివేకానంద

PM మోడీ స్వామి వివేకానంద  బోధనలను అనుసరిస్తూ పాలనను కొనసాగిస్తున్నారు. ఇక వివేకనందుడి అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా కావడం గమనార్హం.  అంతేకాదు వివేకానంద స్థాపించిన ఆశ్రమాలను తరచుగా సందర్శిస్తూ రిలాక్స్ అవుతారు. 1971 భారత్ - పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఆర్ఎస్ఎస్ కు పూర్తి స్థాయి ప్రచారకక్ గా మారారు.ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు.   

Modi beats Nehru Records6/7

నెహ్రూ రికార్డ్ బీట్ చేసిన మోడీ

దేశ ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ.. 16 యేళ్ల 286 రోజులు కంటిన్యూగా  పరిపాలించారు. మొత్తంగా 6130 రోజులు పరిపాలించారు. కానీ 1952 తొలి ఎన్నికల నుంచి చూస్తే ఆయన 4425 రోజులు మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రిగా దేశాన్ని పాలించారు. ఇక 11 జూలై 2026 నాటికి నెహ్రూ రికార్డును ప్రధాని  బీట్ చేయనున్నారు. ఇక ఇందిరా గాంధీ మొత్తంగా ప్రధానిగా 15 యేళ్ల 350 రోజులు పాలించారు. 

Gujarat CM 7/7

గుజరాత్ ముఖ్యమంత్రి

2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో భారత ప్రధాన మంత్రి అయ్యారు. దాదాపు 24 యేళ్లు రాజ్యాంగ బద్ద పదవిలో కొనసాగుతున్న వరల్డ్ లీడర్ గా  రికార్డు నెలకొల్పారు.