Mukhyamantri Mahila Rojgar Yojana 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్నో సరికొత్త పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానిగా మొదటిసారి బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తున్నా మోదీ. ఈ నేపథ్యంలో నేడు బీహార్ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా ఉపాధి స్కీమ్ కింద మోదీ మొదటి విడతగా ఒక్కొక్కొరికి రూ. 10వేల చొప్పున 7.5 మిలియన్ల మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేశారు.
ప్రధాని మోదీ నేడు బీహార్ మహిళలకు భారీ బహుమతిని అందించారు. మహిళా ఉపాథి స్కీమ్ కింద మోదీ మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున 7.5 మిలియన్ల మహిళల బ్యాంకు అకౌంట్లో డబ్బులను జమ చేశారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వర్చువల్‌గా ఈ స్కీమును ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ పథకం ఒక ప్రధాన గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ప్రతి మహిళ ప్రయోజనం పొందుతుందని అన్నారు. ఈ డబ్బుతో ఒక మహిళ మంచి పని చేస్తే, ఆమెకు రెండు లక్షల రూపాయల వరకు లభిస్తుంది. ఈ డబ్బుతో, బీహార్‌లోని నా సోదరీమణులు కిరాణా సామాగ్రి, పాత్రలు, సౌందర్య సాధనాలు, బొమ్మలు, స్టేషనరీలను విక్రయించే చిన్న దుకాణాలను తెరవచ్చని తెలిపారు. ఇది మహిళల పురోగతికి సహాయపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
3/7ఈ పవిత్ర నవరాత్రి రోజులలో, బీహార్ మహిళలతో కలిసి వారి ఆనందంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఈ పవిత్ర నవరాత్రి పండుగ సందర్భంగా మీ ఆశీస్సులు మనందరికీ గొప్ప బలం. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.
4/7ప్రధాని మోదీ మహిళా ఉపాథి స్కీమ్ ప్రారంభించి మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 10వేలు జమ చేశారు. ఈ డబ్బును డిబిటీ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశారు.
స్వంతగా వ్యాపారాన్ని ప్రారంభించానుకుంటే ఈ స్కీమ్ కింద మీకు రూ. 10వేల ఆర్థిక సహాయం లభిస్తుంది. 6 నెలల తర్వాత వ్యాపారాన్ని సమీక్షించి రూ. 2లక్షల అదనపు లోన్ అందిస్తారు.
6/7ఈ మహిళా ఉపాధి స్కీములో చేరాలనుకుంటే మీరు మీ గ్రామసంస్థ లేదా జీవనోపాధి గ్రూపును సంప్రదించాలి. మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకుని ఈ మహిళా ఉపాధి స్కీములో చేరవచ్చు.
దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫోటోలు అవసరం ఉంటాయి. ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందిన తర్వాత చిన్న వ్యాపారాలు ప్రారంభించడంలో సహాయపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా మహిళలను స్వావలంబనతో శక్తివంతం చేయడమే బీహార్ ప్రభుత్వం లక్ష్యం. ఈ స్కీముతో మహిళల ఆర్థిక, సామాజిక స్థితిని మెరుగుపరుస్తాయి.