Add Zee Business As A Preferred Source
App

PM Modi: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. వారికి డబుల్ బొనాంజా..!

Written ByAruna Maharaju
Published: Sep 21, 2025, 06:17 PM IST|Updated: Sep 21, 2025, 09:17 PM IST

Pm Modi Speech Today: ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుంది.. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎన్నో లాభాలు చేకూరనున్నాయని మోదీ అన్నారు. నాగరిక్‌ దేవోభవ అనే మంత్రాన్ని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్తున్నామని.. దాన్ని ప్రతిబింబాన్ని ఈ నెక్స్ట్‌ జనరేషన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా మనం చూస్తామని మోదీ అన్నారు.

Pm Modi Speech Today1/5

ప్రధాని నరేంద్ర మోదీ

 

ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తాయని.. ఈ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో లాభపడతారని మోదీ తెలిపారు. ఈ సంస్కరణలు రాష్ట్రాల అభివృద్ధికి, ఉత్పత్తిదారులకు, కొనుగోలుదారులకు ఉపయోగపడతాయన్నారు.

 

Pm Modi Speech Today2/5

ప్రధాని నరేంద్ర మోదీ

 

ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం ముందుకు సాగుతోందన్నారు మోదీ. స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను వద్దని ప్రధాని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలు దేశంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు ఉపయోగపడతాయన్నారు.

 

Pm Narendra Modi3/5

ప్రధాని నరేంద్ర మోదీ

గతంలో జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు అనేక పన్నుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిందని.. ఇప్పుడు కొత్త సంస్కరణలతో దేశం మరింత సంతోషంగా ఉంటుందని మోదీ చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందని.. అలాగే నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ ఉంటుందని మోదీ తెలిపారు.

Pm Narendra Modi4/5

ప్రధాని నరేంద్ర మోదీ

 

2014లో ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు జీఎస్టీని ప్రజల, జాతి ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టామని మోదీ చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి, సందేహాలు తీర్చి, ఒకే దేశం ఒకే పన్ను అనే లక్ష్యాన్ని సాధించామన్నారు.

 

Pm Modi5/5

ప్రధాని మోదీ

 

కొత్త జీఎస్టీ రేట్లలో 5, 18 శాతం శ్లాబులు ఉంటాయి. దీంతో ఆహార పదార్థాలు, ఔషధాలు, సబ్బులు, టూత్‌పేస్ట్, హెల్త్ ఇన్సురెన్స్ వంటి వాటి ధరలు తగ్గుతాయి. ప్రజల సంక్షేమం కోసం ఈ సంస్కరణలు ముందుకు తీసుకెళ్తామని మోదీ తెలిపారు.