Dimple Hayathi Police Case: డింపుల్ హయతి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాల కంటే గ్లామర్ ప్రదర్శనతో ఫేమస్ అయింది. తాజాగా డింపుల్ తనను కొట్టిందని పని మనిషి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
1/5Dimple Hayathi Police Case: తాజాగా డింపుల్ హయతి .. ఆమె భర్త డేవిడ్ తమను సతాయిస్తున్నట్టు ఇంట్లో పనిచేసే ప్రియాంక బిబర్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.
2/5ప్రియాంక బిబర్ వయసు 22 యేళ్లు. ఒడిషాలో రాయఘడ్ జిల్లా ఆమె నేటివ్ ప్లేస్. షేక్ పేటలోని వెస్ట్ వుడ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. ఈమె డింపుల్ హయతి ఇంట్లో పనిచేస్తుండగా.. ఇంట్లో కుక్కు మొరిగింది. అలా మొరగడానికి కారణం ఆమె అంటూ ఆమెపై అనరాని మాటలతో విరుచుకుపడ్డారని చెప్పింది.
3/5అంతేకాదు తనను వివస్త్రను చేయాలనే ప్రయత్నం చేసారని చెప్పుకొచ్చింది. ఈ విషయమై డింపుల్ హయతి పనిమనిషి.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
4/5గతంలో ఓ పోలీస్ ఆఫీసర్ తో కూడా డింపుల్ హయతి కి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే కదా. డింపుల్ హయతి తెలుగులో ‘గల్ఫ్’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలోని ‘జర జర’ ఐటెం పాటతో పాపులర్ అయింది.
5/5ఆ తర్వాత తెలుగులో ‘ఖిలాడీ’, ‘రామబాణం’ వంటి సినిమాలతో పలకరించింది. ఈ సినిమాలేవి ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో గ్లామర్ నే నమ్ముకుంది. అయినా అమ్మడికి మాత్రం అవకాశాలు మాత్రం రావడం లేదు.