Hamsa Raja Yoga Effect On Zodiac: కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు.. అయితే ఇప్పటికే ఇందులో ఉన్న బృహస్పతి తిరోగమనం చేసి మిథున రాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో నాలుగు రాశుల వారిపై అపారమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Hamsa Raja Yoga Effect On Zodiac Telugu: అక్టోబర్ 19న కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు.. అత్యంత స్పీడ్‌గా ఈ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన హంస రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హంస రాజయోగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్న బృహస్పతి నవంబర్ 11న తిరోగమనం చేయబోతున్నాడు.
1/5ఆ తర్వాత బృహస్పతి గ్రహం డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు మిధున రాశిలోకి తిరిగి వెళ్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఎంతో శక్తివంతమైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మిధున రాశిలోకి తిరిగి వెళ్లడం వల్ల జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశులకి వైవాహికంగా సంపదబరంగా.. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పడి హంస రాజయోగం ఏయే రాశులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి.
2/5మీన రాశి వారికి జాతకంలో బృహస్పతి ఐదవ స్థానంలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల వీరికి అపారమైన ఆనందం కలుగుతుంది. అలాగే ఈ సంచార సమయంలో వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా తయారవుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతోపాటు పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా గుడ్ న్యూస్ వింటారు. అలాగే మీన రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్స్‌తో పాటు కొత్త కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి.
3/5బృహస్పతి సంచారం వల్ల మిధున రాశి వారికి కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక పురోగతి గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు. గొప్ప గొప్ప పనులు చేయడం వల్ల ఈ సమయంలో ఉన్నత శిఖరాలకు చేరుతారు.
4/5కన్యా రాశి వారికి బృహస్పతి గ్రహం 11వ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా వీరికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతోపాటు జీవితంలో ముఖ్యమైన అధ్యయనాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.
5/5మకర రాశి వారికి ఏడవ స్థానంలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అఖండ విజయాలు సాధిస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. స్నేహితుల నుంచి మంచి సపోర్టు లభించి.. ఊహించని ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇక కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతోంది.