Add Zee Business As A Preferred Source
App

Rahu Favorite Zodiac: రాహువు విపరీతంగా ఇష్టపడే రాశులు ఇవే.. వీరు ఎప్పటికైనా కోటీశ్వరులు అవ్వక మానరు!

Published: Oct 11, 2025, 08:41 AM IST|Updated: Oct 11, 2025, 08:41 AM IST

Rahu Most Favorite Zodiac Signs: రాహువు గ్రహం ఎంతో ఇష్టపడే రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు మల్టీ నేషనల్ కంపెనీల నుంచి ఆఫర్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న పనులు చేయగలుగుతారు..

Powerful Rahu Most Favorite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం పరంగా రాహువు గ్రహాన్ని చాలా ప్రత్యేకమైన గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహం తర్వాత అత్యంత నెమ్మదిగా సంచారం చేసే గ్రహాల్లో ఇది ఒకటి. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా రాహు గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్లడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు సమయం పడుతుంది. అప్పుడప్పుడు ఈ గ్రహం తిరోగమనం కూడా చేస్తుంది. 
 

Ketu Zodiac Sign1/5

రాహువు, కేతువు గ్రహాలు

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువు గ్రహాలను చాయాగ్రహాలుగా పిలుస్తారు. వాటి కదలికలు ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలోనే కదులుతూ ఉంటాయి. అంతేకాకుండా అశుభ ఫలితాలను మాత్రమే అందిస్తాడు. ఈ రెండు గ్రహాలు అశుభ స్థానంలో ఉన్న రాష్ట్రాల వారికి వ్యక్తిగత జీవితంలో సమస్యలతో పాటు గందరగోళం, ఎన్నో రకాల సమస్యలు తలెత్తొచ్చు. ఇదిలా ఉంటే రాహు గ్రహం ఎల్లప్పుడూ కొన్ని రాశుల వారిపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల ఆయా రాశుల వారికి ఇది 

Powerful Rahu Most Favorite Zodiac 2/5

రాహువు గ్రహం

18 నెలల తర్వాత ఈ ఏడాది మే నెలలో రాహువు గ్రహం కుంభరాశిలో సంచారం చేసింది. 2026 సంవత్సరం డిసెంబర్ నెల వరకు ఇదే రాశిలో కొనసాగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది చివర్లో కదలికలు జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా రాహు గ్రహం ఇష్టపడే కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది.  

Most Lucky Zodiac Signs Venus Rahu Conjunction3/5

మేషరాశి 

రాహువు ఎంతో ఇష్టపడే రాశుల్లో మేషరాశి ఒకటి. ఈ రాశి వారికి ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికంగా కూడా చాలా వరకు పురోగతి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా చాలా వరకు పెరుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయం గడిపి మానసికంగా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.  

Rahu Aspects On Different Zodiac4/5

కర్కాటక రాశి 

కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎల్లప్పుడూ రాహువు గ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల వీరి ఆదాయం వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారి మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆదాయం భారీ మొత్తంలో పెరిగి బ్యాంకు బాలన్స్ కూడా గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఆనందం విపరీతంగా పెరుగుతుంది. ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.   

Rahu Friendly Signs5/5

తులారాశి

రాహువు గ్రహం ఎంతో ఇష్టపడే రాశులలో తులారాశి వారికి కూడా బోలెడు లాభాలను అందిస్తుంది. వీరికి ఈ సమయంలో తెలివితేటలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా విపరీతంగా పెరిగి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి.