Add Zee Business As A Preferred Source
App

Shukra Aditya Yoga: శక్తివంతమైన శుక్రాదిత్య యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఇక డబ్బే, డబ్బు!

Published: Sep 17, 2025, 09:15 AM IST|Updated: Sep 17, 2025, 09:15 AM IST

Shukra Aditya Yoga Effects In Telugu: శక్తివంతమైన శుక్రాదిత్య యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా వెంట వెంటనే చేయగలుగుతారు. 

Shukra Aditya Yoga Effects On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన యోగాల్లో శుక్రదిత్య రాజయోగం ఒకటి. ఈ రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇది కేవలం కొన్ని శక్తివంతమైన గ్రహాలు కలయిక జరిపినప్పుడు మాత్రమే సంభవిస్తుంది. ముఖ్యంగా ఈ యోగ ప్రభావం రాశుల వారిపై పడితే కీర్తి, ప్రతిష్టలతో పాటు సంపాదన కూడా విపరీతంగా పొందగలుగుతారు. ఇలాంటి శుక్రదిత్య రాజయోగం ఎప్పుడు ఏర్పడుతుందో? దీనివల్ల లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి..
 

Shukra Aditya Yoga1/5

శుక్రాదిత్య యోగం

సెప్టెంబర్ 15వ తేదీన శుక్రుడు సంచారం చేశాడు. మరోసారి 17న మరోసారి శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా ఇప్పటికే ఆ రాశిలో సూర్యుడు సంచార దశలో ఉన్నాడు. దీంతో ఈ రెండు గ్రహాలు కలయిక జరిగింది. ఈ కలయిక వల్ల ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య యోగం ఏర్పడిందని జ్యోతిష్యులు చెబుతున్నారు.   

Shukraditya Sandhi In Telugu2/5

మేషరాశి

ముఖ్యంగా ఈ శక్తివంతమైన శుక్రాదిత్య యోగం కారణంగా మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం సహకరించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.   

Surya Shukra Yuti Ke Upay3/5

సింహరాశి 

సింహ రాశి వారికి ఈ రాజయోగ ప్రభావం వల్ల ఉద్యోగాలు వ్యాపారాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరికి అద్భుతమైన పురోగతి లభిస్తుంది. కొన్ని పనుల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. దీంతోపాటు ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు పొందే అవకాశాలున్నాయి.  

Shukra Upay Telugu4/5

కన్య రాశి 

కన్యా రాశి వారికి శుక్రాదిత్య యోగం ఎఫెక్ట్ వల్ల ఆర్థికపరమైన లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బు కూడా పొందుతారు. దీంతోపాటు పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. వీరికి ఈ సమయంలో గౌరవంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుంది.  

How To Make Shukra Aaditya Sandhi Shanthi5/5

ధనస్సు రాశి. 

ధనస్సు రాశి వారికి ఈ పవర్ఫుల్ రాజయోగ ప్రభావం ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వీరికి కెరీర్లో మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఎక్కడి నుంచో వీరు శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.