Sun Transit Effect On Zodiac: సెప్టెంబర్ 27వ తేదీన సూర్యుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వారి అదృష్టం పెరిగిన భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు.
Sun Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల రాశి సంచారం చేసే గ్రహాల్లో సూర్యగ్రహం ఒకటి. ఈ గ్రహం రాశి సంచారం చేయడమే కాకుండా అప్పుడప్పుడు నక్షత్రం కూడా చేస్తుంది ముఖ్యంగా చాలా అరుదుగా ఈ గ్రహం ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27 ఉదయం సూర్యుడు హస్తా నక్షత్రం లోకి సంచారం చేశాడు. ఉత్తర ఫల్గుణి నక్షత్రం నుంచి హస్తా నక్షత్రం లోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఊహించే ప్రయోజనాలు కలుగుతాయి.
1/5సెప్టెంబర్ 27 ఉదయం 7 గంటలకు సూర్యుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థికంగా కూడా ఆయా రాశుల వారికి కలిసి వస్తుంది. అక్టోబర్ 10వ తేదీ వరకు సూర్యుడు అదే నక్షత్రంలో సంచార దశలో ఉంటాడు. దీనివల్ల మూడు రాశుల వారికి అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. అయితే నక్షత్ర సంచారం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2/5వృషభ రాశి వారికి సూర్యుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా భారీ మొత్తంలో ఉత్సాహం పెరిగి ఫలితంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఈ సమయంలో వీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు.
3/5సూర్యుడు నక్షత్ర సంచారం చేయడం కారణంగా కన్యా రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇక ఈ సమయంలో వీరు అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
4/5హస్తా నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు గలుగుతాయి. ముఖ్యంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి కొన్ని పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. అలాగే వీరు ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు.
5/5ధనస్సు రాశి వారికి వ్యాపారాలపరంగా అద్భుతమైన లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది అలాగే ఉత్సాహం కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది. వీరికి గౌరవం లభించి.. అనుకున్న పనుల్లో సాధించి కీర్తి, ప్రతిష్టలు కూడా పొందుతారు. ఇక ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.