Add Zee Business As A Preferred Source
App

Modi Govt: మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్ దసరా బహుమతి.. భారీ శుభవార్త చెప్పబోతున్న కేంద్రం..!!

Written ByBhoomi
Published: Sep 28, 2025, 01:00 PM IST|Updated: Sep 28, 2025, 01:00 PM IST

Small Saving Schemes: దసరా పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి పొదుపు దారులకు మరొక గుడ్ న్యూస్ ఇవ్వబోతోంది. దేశంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అత్యంత పాపులర్‌,  రిస్క్ తక్కువగా, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కోరుకునేవారికి ఈ పథకాలు సురక్షితమైన ఆప్షన్‌గా ఉంటాయి. ప్రభుత్వం ఈ స్కీమ్స్‌ పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా అందిస్తుంది. ఇందులో PPF, SSY, SCSS, POMIS, NSC, RD, POSA, KVP వంటి పథకాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.

Small Saving Schemes1/11

ఆర్థిక శాఖ ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్ల

ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. 2025 జులై నుంచి సెప్టెంబర్ వరకు రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు కొత్త రేట్లను ప్రకటించనున్నారు. ఈసారీ భారీ మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ పెరుగుదల అయితే ప్రజలకు ఊరట కలిగే అవకాశం ఉంది.

POMIS2/11

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS): ప్రతి నెలా స్థిరంగా వడ్డీ పొందాలనుకునే వారు POMISలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో వడ్డీ 7.4శాతం సంవత్సరానికి, రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

SSY3/11

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన (SSY): తల్లిదండ్రులు తమ కుమార్తె చదువు, పెళ్లి కోసం సేవ్ చేయడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. వడ్డీ 8.2శాతం సంవత్సరానికి, యాన్యువల్లీ కాంపౌండ్ అవుతుంది. అకౌంట్ కుమార్తె 21 ఏళ్లకు చేరేవరకు ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్, రిటర్న్స్ రెండింటిపైనా ట్యాక్స్ మినహాయింపు.

SCSS4/11

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): 60 ఏళ్లు పైబడిన వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వడ్డీ 8.2శాతం, ప్రతి 3 నెలలకు క్రెడిట్. 5 సంవత్సరాల పాటు రూ.30 లక్షల వరకు పెట్టుబడి, 3 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.

RD5/11

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD): RDతో నెలనెల సేవింగ్స్ పెరుగుతాయి. ఐదు సంవత్సరాలపాటు వడ్డీ 6.7శాతం, మినిమం డిపాజిట్ రూ.100. ట్యాక్స్ డిడక్షన్ సాధ్యం.

POSA6/11

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (POSA): సింపుల్ బ్యాంక్ అకౌంట్‌లా ఉపయోగపడుతుంది. 50 రూపాయలకంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై 4శాతం వడ్డీ అందిస్తుంది.

NSC7/11

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): మినిమం రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ 7.7శాతం, వార్షిక క్రెడిట్, ప్రీ-మెచ్యూర్ ఆప్షన్ పరిమిత పరిస్థితుల్లో మాత్రమే.

Post Office Time Deposit8/11

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (ఫిక్స్‌డ్ డిపాజిట్): 1, 2, 3, 5 సంవత్సరాల టర్మ్‌లు. 1 సంవత్సరం 6.9శాతం, 2వ సంవత్సరం 7.0శాతం, 3వ సంవత్సరం 7.1శాతం, 5వ సంవత్సరం 7.5శాతం వడ్డీ అందిస్తుంది. సెక్షన్ 80C కింద డిడక్షన్ ఈ వడ్డీని చెల్లిస్తుంది.  

KVP9/11

కిసాన్ వికాస్ పత్ర

కిసాన్ వికాస్ పత్ర (KVP): ప్రారంభ పెట్టుబడి రూ.1,000, 9.5 సంవత్సరాల్లో డబుల్ అయ్యే స్కీమ్. వడ్డీ 7.5శాతం, లో-రిస్క్ ఆప్షన్ ఉంటుంది.

PPF10/11

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): 15 ఏళ్ల సుదీర్ఘ సేవింగ్స్. వడ్డీ 7.1శాతం యాన్యువల్లీ కాంపౌండ్, రూ.1.5 లక్షల వరకు 80C కింద డిడక్షన్, రిటర్న్ పై ట్యాక్స్ లేదు.  

స్కీమ్స్‌లో పెట్టుబడిదారులు11/11

స్కీమ్స్‌లో పెట్టుబడిదారులు

ఈ అన్ని స్కీమ్స్‌లో పెట్టుబడిదారులు సురక్షిత, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. సెప్టెంబర్ 30న కేంద్రం కొత్త రేట్లను ప్రకటించనుంది. దానిని  స్మాల్ సేవర్స్ కోసం గుడ్ న్యూస్‌గా చూడవచ్చు.