Add Zee Business As A Preferred Source
App

Prabhas Marriage: అనుష్కకు నాకు పెళ్లి జరగాల్సిందే.. ప్రభాస్ షాకింగ్ స్టేట్‌మెంట్..!!

Written ByBhoomi
Published: Sep 15, 2025, 03:27 PM IST|Updated: Sep 15, 2025, 03:27 PM IST


Prabhas Anushka Marriage: టాలీవుడ్‌లో పెళ్లి గురించి ఎక్కువగా చర్చలో ఉండే హీరో ఎవరు అంటే.. మొదటి పేరు ప్రభాస్‌దే. అభిమానులు, ఫ్యామిలీ, మీడియా ఎవరైనా అడిగే ప్రశ్న ఒక్కటే .. డార్లింగ్ పెళ్లి ఎప్పుడూ?" అని. కానీ ప్రభాస్ మాత్రం ఈ ప్రశ్నను సంవత్సరాలుగా సైలెంట్‌గా స్కిప్ చేస్తూ వస్తున్నాడు.

PrabhasMarriage1/6

ప్రభాస్–అనుష్క జంట

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్–అనుష్క జంట రియల్ లైఫ్‌లో కూడా కలవబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఎందుకంటే స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటమే కాకుండా, ఆఫ్ స్క్రీన్‌లో కూడా చాలా క్లోజ్‌గా కనిపించారు. అంతేకాదు, అనుష్క సినిమాలకు దూరంగా ఉండటంతో, ప్రభాస్ కోసం వెయిట్ చేస్తోందా? అని పుకార్లు మరింత పెరిగాయి.

TollywoodGossips2/6

మేము మంచి ఫ్రెండ్స్

కానీ వీరిద్దరూ ఈ రూమర్స్‌కి కట్ ఇచ్చారు. మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయినా అభిమానులు మాత్రం ఈ జంట రియల్‌గా కలిస్తే బాగుంటుందని ఇప్పటికీ ఆశపెడుతూనే ఉన్నారు.

PrabhasAnushka3/6

ఆదిపురుష్ షూటింగ్

ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ప్రభాస్–కృతి సనన్ లవ్ స్టోరీ హెడ్లైన్స్‌లో నిలిచింది. మీడియా, సోషల్ మీడియా అంతా వీరి గురించి రాశాయి. బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప్‌బుల్ షోలో కూడా ఈ ప్రశ్నను నేరుగా అడిగారు. ప్రభాస్ మాత్రం తన స్టైల్లో సైలెంట్‌గా దాటేసాడు. దీంతో ఈ గాసిప్స్ మరింత హైలైట్ అయ్యాయి. కానీ కృతి సనన్ వేరే వ్యక్తితో డేటింగ్‌లో ఉందని బయటపడటంతో ఈ ఎపిసోడ్ కూడా ముగిసింది.

Prabhas Marriage News4/6

అనుష్క నటించిన ఘాటి మూవీ

ఇక తాజాగా అనుష్క నటించిన ఘాటి మూవీకి ప్రభాస్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. నీ పవర్‌ఫుల్ లుక్ సూపర్బ్. మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్టు పెట్టాడు. దీంతో మళ్లీ ప్రభాస్–అనుష్క బంధం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

Prabhas Anushka Latest Updates5/6

నిజంగానే పెళ్లి కుదురుతుందా

ప్రభాస్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.  ఈ రూమర్స్ ఆగాలంటే నాకో లేక అనుష్కకో పెళ్లి జరగాల్సిందే. అప్పటి వరకు ఇవి ఆగవు అని సరదాగా కామెంట్ చేశాడు. కానీ అభిమానులు ఈ మాటను సీరియస్‌గా తీసుకుని  ఇప్పుడు నిజంగానే పెళ్లి కుదురుతుందా?" అని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

Prabhas Marriage Rumours 20256/6

సోషల్ మీడియా షేక్

ఎవరితో పెళ్లి చేసుకుంటాడో  అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.  కానీ ఒక విషయం మాత్రం ఖాయం  ప్రభాస్ పెళ్లి జరగబోతుందన్న వార్త ఎప్పుడు బయటికొస్తే, అది సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం.