Add Zee Business As A Preferred Source
App

Prabhas: తమన్నాకు ఆ మాస్టర్ తోనే పని..నేనేమన్నా తప్పుగా మాట్లాడానా... ప్రభాస్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Written ByVishnupriya
Published: Oct 12, 2025, 04:25 PM IST|Updated: Oct 12, 2025, 04:30 PM IST

Tamannaah: ప్రముఖ హీరో ప్రభాస్.. ఇటీవల తమన్నాపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రభాస్ ఏకంగా స్టేజ్ పైన అలా అనేస్తారు.. అని ఎవరు ఊహించలేరు. ఇంతకీ ప్రభాస్ ఏమన్నారు.. అసలేం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

Prabhas Interview 1/5

ప్రభాస్ తమన్నా

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ప్రభాస్ సినిమా ఈవెంట్లో ఏవైనా చేసిన వ్యాఖ్యలు అప్పుడప్పుడు వైరల్ గా మారుతుంటాయి. కొద్ది రోజుల క్రితం అలాంటి సంఘటనే చోటుచేసుకుంది ..ప్రభాస్ - రాఘవ లారెన్స్ కాంబినేషన్లో వచ్చిన రెబల్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా.. ఫలితం మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేదు.   

Prabhas about Tamannaah2/5

ప్రభాస్ తమన్నా

ఈ సినిమా ఈవెంట్ లో ప్రభాస్ హీరోయిన్ తమన్నా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తమన్నా ఉదయం లేస్తే పని, సాయంత్రం లేస్తే పని, మాస్టర్ తో పని అని మాట్లాడతారు.. అయితే అక్కడ ఫ్యాన్స్ గట్టిగా అరవడంతో ఏంటయ్యా నేనేమైనా తప్పుగా మాట్లాడానా.. అంటూ ప్రభాస్ అనటంతో ఆ మాటలు కాస్త తెగ వైరల్ అయ్యాయి. 

Prabhas3/5

ప్రభాస్ తమన్నా

అలాగే తమన్నాని సినిమాలో ఎలా చూపించారో.. నన్ను కూడా బాగానే చూపించారు అంటూ ప్రభాస్ చెబుతుంటే.. అటు మరో హీరోయిన్ దీక్షా సేథ్ వెనక నించొని మరీ నవ్వుతున్నట్టు అదే వీడియోలో కనిపిస్తుంది.

Prabhas Herione4/5

ప్రభాస్ తమన్నా

అలా మొత్తానికైతే ప్రభాస్ తమన్నా గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో..మన డార్లింగ్ ఒకప్పుడు ఇలా ఉండేవారు అనే కామెంట్స్ తో వైరల్ అవుతుంది.. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం.. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

Prabhas Movies 5/5

ప్రభాస్

మరోవైపు కల్కి 2, సలార్ 2 చిత్రాలతో పాటు ఫౌజీ, స్పిరిట్ సినిమాలను కూడా లైన్ లో పెట్టారు. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రానున్న స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.