Prabhas Latest Movies: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన నటించేందుకు ఎందరో ముద్దుగుమ్మలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. అలాంటి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కానీ ప్రభాస్ మూవీని రిజెక్ట్ చేసిన ఓ స్టార్ హీరోయిన్ ఉందని మీకు తెలుసా..! ఆ భామ ఎవరంటే..?
1/5ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. గతేడాది కల్కి 2898 A.D. మూవీతో హిట్ అందుకున్న రెబల్ స్టార్.. రాజాసాబ్‌తో సంక్రాంతికి అభిమానుల ముందుకు రానున్నాడు. ఫౌజీ, స్పిరిట్ సినిమాలతోపాటు సలార్-2, కల్కి-2 సినిమాలను ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.
2/5బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ ఏ మూవీ వచ్చినా.. ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రభాస్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా రాజాసాబ్ రిలీజ్ కానుండడంతో ఈసారి థియేటర్ల వద్ద భారీ సందడి ఉండనుంది.
3/5ఇక ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో మూవీలో హీరోయిన్‌గా నటించడానికి శ్రద్ధా కపూర్ కంటే ముందు నిర్మాతలు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను సంప్రదించారని తెలుస్తోంది.
4/5సాహో సినిమా చేయడంపై కత్రినా కైఫ్ ఆసక్తిలేకపోవడంతో రిజెక్ట్ చేసింది. కత్రినా నిర్ణయం కోసం నిర్మాతలు దాదాపు ఆరు నెలలు ఎదురుచూశారని.. చివరకు శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రభాస్ పక్కన నటించనని కత్రినా కైఫ్ చెప్పినట్లు కొందరు రూమర్లు కూడా సృష్టించారు. అయితే సాహో మూవీని కత్రినా ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయంపై క్లారిటీ లేదు.
5/5సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.435 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా.. బాలీవుడ్‌లో సాహో బాగా ఆడింది. శ్రద్ధా కపూర్ ఈ సినిమాకు ప్లస్ అయింది.