Prabhas Rejected Movies: సినిమా పరిశ్రమలో ఒక్కోసారి ఓ హీరో కోసం అనుకున్న కథ.. మరొరి దగ్గరికి వెళ్లడం వెరీ కామన్. అలా ఓ కథానాయకుడు రిజెక్ట్ చేసిన స్టోరీతో మరొక హీరో స్టార్ అయిన సందర్బాలున్నాయి. ఒక్కోసారి డేట్స్ కుదరకనో.. మరికొన్ని ఆ సమయంలో విన్న కథ నచ్చక పోవడంతో వాటిని వద్దన్న సందర్భాలుంటాయి. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథలతో వేరే హీరోలు చేసిన సినిమాల విషయానికొస్తే.
1/11Prabhas Rejected Stories : ఒక్కోసారి హీరోలు కథ నచ్చక వద్దన్న కథలున్నాయి. కొన్నిసార్లు స్టోరీలు నచ్చినా.. అప్పటికే కమిటైన ఇతర ప్రాజెక్ట్స్ వల్ల ప్రభాస్ సినిమాలు చేయలేకపోయిన సందర్భాలున్నాయి. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..
2/11ఒక్కడు: మహేష్ బాబును మాస్ లో తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం ‘ఒక్కడు’. గుణశేఖర్ ముందు ఈ మూవీ స్టోరీని ప్రభాస్‌తో తెరకెక్కిద్దామనుకున్నాడు. ప్రభాస్, కృష్ణంరాజులకు స్టోరీ కూడా వినిపించాడట. ఆ తర్వాత స్క్రిప్ట్ పై అనుమానం వచ్చిన రిస్క్ అనుకోని ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు.
3/11సింహాద్రి: 'సింహాద్రి' చిత్రాన్ని రాజమౌళి ముందుగా బాలయ్యతో చేద్దామనుకున్నాడు. ఆ తర్వాత ఈ కథను జక్కన్న ప్రభాస్‌కు వినిపించాడట. అయితే ఈ రేంజ్ మాస్ స్టోరీకి తనకు వర్కౌట్ కాదేమో అనే సందేహంతో ఈ మూవీని రిజెక్ట్ చేసినట్టు సమాచారం.
4/11బృందావనం: 'మున్నా' లాంటి ఫ్లాప్ చిత్రాన్ని ఇచ్చానని దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ తర్వాత బృందావనం సినిమా స్టోరీని డార్లింగ్ కు వినిపించాడట. అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేకుండే. మరోవైపు దిల్ రాజుతో మరో సినిమా చేస్తానని కమిట్ అవ్వడంతో ఈ కథను ఎన్టీఆర్ తో తెరకెక్కించాడు.
5/11డాన్ శీను: గోపీచంద్ మలినేని ఫస్ట్ ఈ స్టోరీని ప్రభాస్ కోసమే అనుకొని రాసుకున్నాడు. అయితే అప్పటికే బుజ్జిగాడు సినిమా చేసాడు ప్రభాస్. 'డాన్ శీను'స్టోరీ అదే తరహాలో ఉండటంతో ఈ స్టోరీని వద్దని చెప్పాడట.
6/11ఊసరవెల్లి: ఊసరవెల్లి సినిమా కథ ముందుగా సురేందర్ రెడ్డి ప్రభాస్ కు వినిపించాడట. ఎందుకో తెలియదు కానీ అప్పుడున్న పరిస్థితుల కారణంగా ప్రభాస్ ఈ స్టోరీని వద్దని చెప్పాడు. ఈ సినిమా పెద్దగా నడవలేదు.
7/11దిల్: ఆది లాంటి పవర్ ఫుల్ సక్సెస్ తర్వాత వి.వి. వినాయక్ తెరకెక్కించిన ‘దిల్’ సినిమాను ముందుగా ప్రభాస్ కు వినిపించాడట. ఈ సినిమాకు ఓకే కూడా చెప్పాడట. కానీ అప్పటికే రెబల్ స్టార్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను చేయలేకపోయాడు. ఇక వినాయక్ .. అప్పటికే దిల్ రాజుకు ఇచ్చిన మాట మేరకు నితిన్ తో ఈ సినిమా చేసాడు.
8/11జిల్: జిల్ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ ముందుగా ప్రభాస్ కోసమే రాసుకున్నాడు. కానీ'బాహుబలి'తో బిజీగా ఉన్న కారణంగానే ఈ చిత్రాన్ని ప్రభాస్ చేయలేకపోయాడు. కానీ కథ నచ్చడంతో చి గోపీచంద్‌తో చేయమని చెప్పాడు. ఆ తర్వాత అదే డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌తో రాధే శ్యామ్ సినిమా చేసాడు.
9/11కిక్: రవితేజ మార్కెట్ రెండింతలు చేసిన మూవీ ‘కిక్’. సురేందర్ రెడ్డి ఈ మూవీ స్టోరీ కథను ముందుగా ప్రభాస్ కు వినిపించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ స్టోరీని వద్దని చెప్పడంతో చివరకు ఈ సినిమా రవితేజ దగ్గరకు వెళ్లింది.
10/11నాయక్: వినాయక్‌తో ‘యోగి’ సినిమా చేసాడు ప్రభాస్. కానీ మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ‘నాయక్’ కథను వినాయక్ వినిపించాడట. ఆ మూవీ కథ నచ్చినా.. అప్పటికే కమిటైన మిర్చి, బాహుబలి సినిమాల వల్ల ‘నాయక్’ ను రిజెక్ట్ చేయకతప్పలేదు.
11/11ఆర్య: దర్శకుడు సుకుమార్‌కు హీరో ప్రభాస్ తో మంచి స్నేహమే ఉంది. ముందుగా ఆర్య కథను ప్రభాస్‌కు వినిపిస్తే తన ఇమేజ్‌కు ఈ సినిమా సెట్ కాదని ఒదిలేసాడట.