Prabhas: ప్రభాస్ రిజెక్ట్ చేసిన త్రిష సినిమా.. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్..

Prabhas Trisha: ప్రభాస్, త్రిష కాంబినేషన్లో వర్షం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. అయితే.. త్రిష నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి ప్రభాస్ వదులుకున్నారన్న విషయం మీకు తెలుసా..?
 

1 /6

తెలుగు చిత్రసీమలో కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన చిత్రాల కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 

2 /6

ఈ సినిమా అప్పటిలో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగ రాసింది. ఈ చిత్రం ద్వారా త్రిష స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే త్రిష వర్షం సినిమా అయిన వెంటనే వచ్చిన ఈ చిత్రానికి ముందుగా అనుకునేది సిద్ధార్థను కాదంట.

3 /6

ఈ సినిమా కథ మొదట స్టార్ హీరో ప్రభాస్‌కు దర్శకుడు ప్రభుదేవా చెప్పారంట. కానీ అప్పట్లో డేట్స్ సమస్య వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్‌ను వదిలేశారు. అప్పుడు ఈ కథను చిన్న హీరో అయిన సిద్ధార్థ్ అంగీకరించడంతో.. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

4 /6

ఈ చిత్రాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించాడు. తెలుగులో విడుదలైన ఈ సినిమా మాత్రమే కాకుండా, మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయి, భారతీయ సినిమా చరిత్రలో ఒక విశేష రికార్డు నెలకొల్పింది.

5 /6

ఈ సినిమాతో సిద్ధార్థ్ కెరీర్‌కు బలమైన బూస్ట్ లభించింది. ఇప్పటికే "బాయ్స్" ద్వారా పరిచయం అయినా, ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమాకు 9 ఫిలిం ఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు రావడం విశేషం.  

6 /6

కన్నడ, తమిళం, బెంగాలీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బంగ్లాదేశ్, నేపాలి, హిందీ భాషల్లో ఈ సినిమాలు రీమేక్ చేశారు. ఈ కథ ఎంత అద్భుతమైందో చెప్పడానికి ఈ రీమేక్‌లు చక్కటి ఉదాహరణ. మరి ఇలాంటి సినిమా ప్రభాస్ చేసి ఉంటే.. రిజల్ట్ ఎలా ఉండేదో అని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు.