Add Zee Business As A Preferred Source
App

Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..రాజా సాబ్ ఘోరమైన డిజాస్టర్ చవిచూడనుందా.. !

Written ByVishnupriya
Published: Oct 05, 2025, 05:20 PM IST|Updated: Oct 05, 2025, 05:20 PM IST

The Raja Saab First Review : ప్రభాస్ త్వరలోనే.. దాదాపు 3 పాన్ ఇండియా సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోతున్నాడు. ఇందులో ముందుగా మారుతీ దర్శకత్వంలో రానున్న రాజా సాబ్ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి ఆందోళన చెందుతున్నారు ప్రభాస్ అభిమానులు..
 

Raja Saab First Review 1/5

ప్రభాస్ రాజా సాబ్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. తెలుగులోనే కాదు.. ప్రతి భాషలోనూ కూడా ఆయనకి స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఉంది. అందుకే వరుస పాన్ ఇండియా సినిమాలతో యమ బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే.. ముందుగా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. 

The Raja Saab Talk 2/5

ప్రభాస్ రాజా సాబ్

ప్రభాస్ దగ్గర నుంచి రానున్న పాన్ ఇండియా సినిమాలలో ముందుగా మారుతీ దర్శకత్వంలో వస్తోన్న.. రాజా సాబ్ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమా.. టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Prabhas Movies3/5

ప్రభాస్ రాజా సాబ్

ఇలాంటి తరుణంలో ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే ఒక వార్త ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయానికి వస్తే ప్రభాస్ సినిమాల్లో.. ఆర్ తో మొదలైన చిత్రాలు అన్నీ కూడా ఘోరమైన పరాజయాన్ని చవిచూశాయి. 

Prabhas Movies Sentiment 4/5

ప్రభాస్ రాజా సాబ్

రాఘవేంద్ర, రెబల్.. అంతెందుకు ఈ మధ్య వచ్చిన రాదే శ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ చవిచూసింది. ఈ క్రమంలో ఈ మూడు సినిమాల తరువాత మరోసారి ప్రభాస్ రాజా సాబ్ సినిమా కూడా ఆర్ అనే అక్షరంతో మొదలుకానుంది. దీంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అని కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Prabhas Raja Saab5/5

ప్రభాస్ రాజా సాబ్

కొంతమంది అభిమానులు ఈ పోస్టులు చూసి నిరాశకు గురవుతున్న కానీ.. మరి కొంతమంది ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇంకొంతమంది ఈ చిత్రం పేరు ది రాజా షాప్ కావడంతో.. ముందు అక్షరం ది కాబట్టి ఎటువంటి నష్టం రాదు అని కూడా కామెంట్లు పెడుతున్నారు.