Add Zee Business As A Preferred Source
App

Prabhas: తిరుమలకి ప్రభాస్ ఫ్యామిలీ.. వాళ్ళిద్దరూ కలిసి ‌..ఎందుకో తెలుసా?

Written ByVishnupriya
Published: Oct 27, 2025, 03:32 PM IST|Updated: Oct 27, 2025, 03:32 PM IST

Prabhas Family : ప్రస్తుతం ప్రభాస్ గురించి పాన్ ఇండియా పరంగా.. పరిచయాలు అస్సలు అక్కర్లేదు. వరస సినిమాలతో ఏమన్నా బిజీగా ఉన్నారు ఈ హీరో..రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ తిరుమలలో కనిపించడంతో.. ప్రభాస్ ఎక్కడ అంటూ అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ తిరుమల కి ఎవరెవరు వచ్చారు.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

Prabhas Family Photos 1/5

ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తూ.. విడుదల చేస్తూ.. అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ది రాజా సాబ్ సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన..  మరొకవైపు ఫౌజీ సినిమాతో అదే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నారు.   

Prabhas Sisters 2/5

ప్రభాస్

అలాగే స్పిరిట్ ఈ ఏడాది డిసెంబర్లో.. షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైన్ లో ఉంచారు. అలా వరుస సినిమాలు చేస్తున్నారు కానీ ఇంకా పెళ్లిపై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Prabhas Tirumala 3/5

ప్రభాస్ సిస్టర్స్

తాజాగా ప్రభాస్ ఫ్యామిలీ తిరుమలలో కనిపించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ సోదరి సాయి సుదీప్తి.. కెమెరా కంటికి చిక్కి అందరి దృష్టిని ఆకట్టుకుంది. 

Prabhas Marriage 4/5

ప్రభాస్ సిస్టర్స్

ప్రభాస్ పెళ్లి కోసమే వీరు ఇప్పుడు తిరుమలలో కనిపించినట్లు సమాచారం. మరి ఇప్పటికైనా ఈ వార్తను నిజం చేస్తారా లేక ఇది కూడా రూమర్ గానే మిగిలిపోతుందా అన్నది చూడాలి.

Prabhas Marriage Update 5/5

ప్రభాస్ సిస్టర్స్

ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి ప్రకటన చేయాలి.. అని అభిమానులు సినీ సెలెబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు.