Prabhas Vs Deepika Fans War: సోషల్ మీడియాలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొనే ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతోంది. ఇటీవలే కల్కీ 2 సినిమా నుంచి దీపికను పక్కనబెట్టడంతో ఇద్దరు స్టార్లకు సంబంధించిన ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది.
1/5ప్రభాస్ నటించిన కల్కీ 2 సినిమా నుంచి దీపికను పక్కనబెట్టడంతో సోషల్ మీడియా వేధికగా ఇద్దరు ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తోంది. ప్రధానంగా దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు..
2/5మరోవైపు అలా గొంతెమ్మ కోరికలు కోరితే, కల్కీ 1 సినిమాలో ప్రెగ్నెంట్‌గానే దీపిక నటించారు. ఎక్కువ కమిట్మెంట్ లేదా ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమెకు మద్ధతు ఇస్తున్నారు. ఎస్‌ఎంల కౌంటర్ కూడా ఇస్తున్నారు.
3/5ఇదిలా ఉండగా రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ సినిమాలో దీపికా పదుకొన నటించిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న ఈ సినిమా సీక్వెల్‌లో మాత్ర ఆమె నటించలేదని మూవీ మేకర్స్ ప్రకటించారు.
4/5కల్కీ 2 లో దీపిక భాగం కాదని అన్నీ విధాలుగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే కల్కీ వంటి సినిమాల్లో నటించే నటీనటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం
5/5అందుకే దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. దీంతో నిన్నటి నుంచి ప్రభాస్, దీపిక ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేధికగా రచ్చ నడుస్తోంది.