Add Zee Business As A Preferred Source
App

Gold Rate: తొందరపడకండి.. తులం బంగారం రూ. 25వేలు తగ్గుతుంది..? కారణాలివే..!!

Written ByBhoomi
Published: Sep 15, 2025, 09:44 PM IST|Updated: Sep 15, 2025, 09:44 PM IST

Gold Rate: తెలుగింటి ఆడపడుచులు సంపదకు ప్రతీకగా భావించే బంగారం ధరలు ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1.13 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఇప్పటివరకు ఉన్న గరిష్ట రికార్డు అని చెప్పవచ్చు. దీంతో సాధారణ ప్రజలు  ఇప్పుడే కొనాలా.. వేచి చూడాలా..? అనే గందరగోళంలో ఉన్నారు.  ఇన్వెస్టర్లు మాత్రం బంగారం భవిష్యత్‌పై గట్టి లెక్కలు వేసుకుంటున్నారు. 
 

Gold Price1/6

 బంగారం ధరలు

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో నెలకుంటున్న  అనిశ్చితి, డాలర్ బలహీనత, ఈక్విటీ మార్కెట్ల పతనం.. ఇవన్నీ కూడా  బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేశాయని చెప్పుకోవచ్చు.  అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర సుమారు $3700కి చేరుకుంది. 

Gold Investment2/6

ఇన్వెస్టర్లు రిస్క్

ఇది చరిత్రలోనే అత్యధికం. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి భయపడే సమయంలో సాధారణంగా తమ డబ్బును బంగారంలో పెట్టుబడి పెడతారు. అందుకే పసిడి ధరలు ఈ స్థాయికి దూసుకెళ్లాయి.

24 Carat Gold3/6

దాదాపు 22 రెట్లు

2000వ సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర కేవలం రూ. 5,000 మాత్రమే ఉండేది. అక్కడి నుంచి 2025 నాటికి అది రూ. 1.13 లక్షలకు చేరుకోవడం అంటే దాదాపు 22 రెట్లు పెరిగింది. ఈ వృద్ధి రేటు ఈక్విటీ మార్కెట్ల కంటే తక్కువైనా, బంగారం మాత్రం ఎప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనంగా కొనసాగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు.  

Dollar vs Gold4/6

బంగారం ఇంకా పెరుగుతుందా

ఇప్పుడు చాలా మందికి మిగిలిన ప్రశ్న బంగారం ఇంకా పెరుగుతుందా? లేక తగ్గుతుందా? అనే సందేహం ఉంది.  నిపుణుల అంచనా ప్రకారం, అమెరికా డాలర్ రికవరీ అయితే, అలాగే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ పుంజుకుంటే బంగారం ధరల్లో 10–20శాతం వరకు సవరణ (కరెక్షన్) వచ్చే అవకాశం ఉంది.   

Stock Market vs Gold5/6

బంగారం ధరలు కొంతవరకు తగ్గే అవకాశం

అంటే బంగారం ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కానీ జియోపాలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ ఎకానమీ స్థిరపడకపోతే, పసిడి మళ్లీ కొత్త రికార్డులను తాకే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

Gold Price Today6/6

దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథం

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేసే ముందు దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో ముందుకెళ్లడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తక్షణ లాభం కోసం కాకుండా, భవిష్యత్తుకు సేఫ్‌గార్డ్‌గా పసిడిని ఆలోచిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు.