Priyanka Arul Mohan Pregnancy: హీరోయిన్ ప్రియాంక మోహన్ కడుపుతో ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అయితే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భవతి ఎలా అయ్యిందంటూ తమిళ ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. ఇంతకీ వైరల్ అయిన ఫొటోలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1/6పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా సూపర్ హిట్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల సరసన చేరింది ప్రియాంక మోహన్. తాజాగా తాను గర్భవతిగా ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
2/6పెళ్లి ప్రకటన లేకుండానే ఆమె గర్భవతి ఫోటో చూసిన తమిళ అభిమానులు ఒక్క క్షణం షాక్ అయ్యారు. ఆ తర్వాతే ఆ ఫోటో వెనుక ఉన్న నేపథ్యం అర్థమైంది.
3/6'గ్యాంగ్ లీడర్', 'డాక్టర్', 'డాన్', 'శ్రీకారం' వంటి వరుస హిట్ చిత్రాలతో తెలుగు, తమిళ భాష్లలో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రియాంక మోహన్, తన మనోహరమైన లుక్స్, సహజమైన నటనతో తక్కువ కాలంలోనే అగ్రనటిగా ఎదిగారు.
4/6ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు తన అందమైన ఫోటోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది.
5/6ఆ విషయంలో ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో గర్భవతిగా ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అది చూసిన అభిమానులు షాక్‌తో "ప్రియాంక మోహన్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు?".. "ఇది నిజమేనా?" వంటి ప్రశ్నలు తమిళ ఫ్యాన్స్ అడగడం ప్రారంభించారు.
6/6అభిమానుల్లో ఈ గందరగోళం కొనసాగుతుండగా.. ఆ ఫోటో ఇటీవలే విడులైన 'OG' సినిమా షూటింగ్ సమయంలో అందులో హీరోయిన్ కణ్మణి పాత్ర కోసం ఆ వేషం వేసినట్లు వెల్లడైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రియాంక మోహన్ అతని జోడీగా నటించారు. ఈ ఫోటోలు ఆమె గర్భవతిగా సినిమా షూటింగ్ చేస్తున్నపుడు ఫొటోలు తీసినవి.. ఆమె తాజాగా షేర్ చేశారు. దీంతో ఇప్పుడు అవి ట్రెండింగ్ అవుతున్నాయి.