Add Zee Business As A Preferred Source
App

Star Actress: డబ్బులిచ్చి మరి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు.. వాళ్లెవరో కూడా నాకు తెలుసు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Written ByAruna Maharaju
Published: Sep 16, 2025, 09:29 PM IST|Updated: Sep 16, 2025, 09:29 PM IST

Priyanka Mohan: ప్రియాంక మోహన్.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకెళ్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక మోహన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై కొంత మంది కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని.. నాకు మూవీ ఆఫర్స్ తగ్గడానికి కారణం కూడా అదే అంటూ స్టేట్‌మెంట్ పాస్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన ఈ కామెంట్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
 

Heroine Priyanka Mohan1/6

హీరోయిన్ ప్రియాంక మోహన్

మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ చేసిన షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని కావాలనే కొంతమంది పనిగట్టుకొని మరి ట్రోలింగ్ చేస్తున్నారని.. సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం కూడా అదేనని చెప్పింది. నిజానికి ప్రియాంక మోహన్‌‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది.   

Heroine Priyanka Mohan2/6

ప్రియాంక మోహన్

ప్రియాంక మోహన్ యాక్టింగ్‌పై, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌పై.. కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమెకి మూవీ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఇక ఈ ట్రోలింగ్‌పై ప్రియాంక ఫస్ట్ టైమ్ స్పందించింది. 

Heroine Priyanka Mohan3/6

హీరోయిన్ ప్రియాంక మోహన్

నాపై వస్తున్న ట్రోలింగ్స్ కావాలనే చేయిస్తున్నారు.. అవన్నీ పైడ్ ట్రోలింగ్స్. కొంతమంది కావాలని డబ్బులిచ్చి మరీ నా గురించి నెగటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. కేవలం నా ఇమేజ్‌ను డ్యామేజ్ చెయ్యడానికే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వాళ్లెవరో కూడా తనకు తెలుసంటూ ప్రియాంక చెప్పింది.   

Heroine Priyanka Mohan4/6

హీరోయిన్ ప్రియాంక మోహన్

దీంతో ఇప్పుడు ప్రియాంక మోహన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అయితే.. ఈ బ్యూటీపై అలా కావాలని ఎవరు చేస్తున్నారనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  

Heroine Priyanka Mohan5/6

హీరోయిన్ ప్రియాంక మోహన్

అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తమిళ స్టార్స్‌తో వర్క్ చేసే ప్రముఖ ఏజెన్సీతో ప్రియాంక మోహన్.. ఒప్పందం క్యాన్సల్ చేసుకోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కావాలనే ప్రియాంకపై నెగటివ్ స్ప్రెడ్ చేసి.. ఛాన్సులు రాకుండా చేస్తున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.   

Heroine Priyanka Mohan6/6

హీరోయిన్ ప్రియాంక మోహన్

2019లో ఓంద్ కథే హెల్లా అనే కన్నడ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ప్రియాంక మోహన్. ఇక అదే సంవత్సరం న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీలో ప్రియాంక హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.