Jam Making Small Business Idea: వ్యాపారం అనగానే భారీ పెట్టుబడులు, పెద్ద పెద్ద ఆఫీసులు ఇలాంటి ఆలోచనలే మనస్సులోకి వస్తాయి. కానీ నిజానికి వ్యాపారం ప్రారంభించడానికి ఒక చిన్న ఆలోచన చాలు. ఆ ఆలోచనను ఎలా అమలు చేస్తామన్న దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ ఐడియాతో ఎన్నో లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
ఒక చిన్న ఆలోచనతో పెద్ద కలలను సాకారం చేసుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ఫిలాసఫీ బిజినెస్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
మీరు కూడా సొంతంగా చిన్న బిజినెస్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకు ఎన్నో లాభాలను తీసుకువస్తుంది.
జామ్ బిజినెస్ ఐడియా ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం. జామ్ వ్యాపారం అనేది ఒక ఆసక్తికరమైన, లాభదాయకమైన వ్యాపార అవకాశం.
ఇది చిన్న స్థాయిలో ప్రారంభించి, క్రమంగా విస్తరించవచ్చు. జామ్ తయారీ అనేది ఒక కళ, ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించడానికి అవకాశం ఇస్తుంది.
జామ్ బిజినెస్‌ను ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు. ఇది అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చూసే వ్యాపారం. ఈ బిజినెస్ చేయడానికి టిప్స్ అలాగే లాభాలు గురించి తెలుసుకుందాం.
చిన్న స్థాయిలో జామ్ బిజినెస్‌ను ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది. మీరు వివిధ రకాల పండ్లు, రుచులతో జామ్ తయారు చేసి, కొత్త ఉత్పత్తులను తయారు చేయవచ్చు.
జామ్ వ్యాపారం చేయడం కోసం మీరు కొన్ని ముడి పదార్థాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు స్టవ్, జాడీలు, మెషీన్, సీలింగ్ పరికరాలు ముఖ్యంగా కొనుగోలు చేయాలి.
దీంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన లైసెన్స్లు, అనుమతులు పొందాలి.
ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెటింగ్ వ్యూహాలు, అమ్మకాల ప్రణాళికలు రూపొందించాలి.
మీరు తయారు చేసిన జామ్‌ను ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా అమ్మవచ్చు. దీంతో మీ బ్రాండ్ మరింత పెరుగుతుంది.
జామ్ వ్యాపారం స్టార్ట్ చేయడానికి మీకు కనీసం రూ. 2 లక్షలు అవుతుంది. మీ వద్ద సరిపడ డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్ తీసుకోవచ్చు.
ఈ బిజినెస్‌తో నెలకు రూ. 80 లక్షలు సంపాదించవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.