Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..?

Thu, 14 Nov 2024-7:16 pm,

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటునే.. మరొవైపు పూరీ మ్యూజింగ్స్ తో అభిమానుల్ని అలరిస్తున్నారు. అంతే కాకుండా.. ఈ ప్లాట్ ఫామ్ వేదికగా అనేక అంశాల గురించి వివరిస్తుంటారు. దీన్ని చాలా మంది ఫాలో అవుతుంటారని సమాచారం.  

అయితే.. తాజాగా, పూరీ జగన్నాథ్ ఎమోషల్ బ్లాక్ మెయిల్ అంశం గురించి పూరీ మ్యూజీంగ్స్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.  

కొంత మంది సమాజంలో కావాలని ఎదుటి వాళ్లను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంటారని అన్నారు. నీకిది చేశాను.. నువ్వు నాకు అది చేసి పెట్టాలి అని వేధిస్తుంటారు. కానీ ఒక ప్రేమతో కాకుండా.. కేవలం అవసరాల కోసం ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారు. కేవలం తమ అసవరాల కోసం ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారు.  

ఇలాంటి వారి నుంచి దూరంగా ఉండాలని కూడా పూరీ చెప్పినట్లు తెలుస్తొంది. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ల నుంచి బ్లాక్ మెయిలింగ్స్ రావొచ్చని కూడా పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తొంది.  

నీకోసం అది చేశాను.. ఇన్ని చేశాను.. చదువు, పెళ్లి, కెరియర్ మొదలైన అంశాలపై ఒత్తిడి రావొచ్చని అన్నారు. ఇలాంటి వాటికి తలొగ్గవద్దని ఒక బాధ్యతతో, మెచ్యూర్ గా ఆలొచించి ఎవరు ఏమన్నా.. మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలని కూడా పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్స్ ఎక్కడైన కన్పిస్తే.. వెంటనే దూరంగా వెళ్లిపోవాలని చెప్పినట్లు తెలుస్తొంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link