Puri Charmi Kaur Relation: ఛార్మీతో తనకున్న రిలేషన్ పై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి మీడియా కంట పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరీ ఛార్మీతో తనకున్న అనుబంధం పై స్పందించారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసు అని ఆయన అన్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
1/5దర్శకుడు పూరి జగన్నాథ్ ఛార్మితో తనకు నా అనుబంధంపై క్లారిటీ ఇచ్చాడు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మి తెలుసు అని 20 ఏళ్ల స్నేహంతో ఆమెతో కలిసి పని చేస్తున్నామని ఆయన అన్నారు. గత కొద్ది రోజులుగా వీరు కలిసి మీడియా కంట పడుతున్న సంగతి తెలిసిందే.
2/5ఈ నేపథ్యంలో తనకు ఛార్మీకి ఉన్న రిలేషన్ పై దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. పెళ్లైన మహిళతో ఉంటే ఎవరికి సమస్య ఉండదని.. ఛార్మికి పెళ్లి కాలేదు కాబట్టి తమ మధ్య ఏదో రిలేషన్ ఉందని అనుకుంటున్నారు. స్నేహం మాత్రమే శాశ్వతం అన్నారు.
3/5ఇక పూరీ నిర్మాణ సంస్థ అయిన 'పూరీ కనెక్ట్' బాధ్యతలను కొంతకాలంగా ఛార్మి చూసుకుంటున్నారు. ఇక పూరి జగన్నాథ్ బద్రి సినిమా 2006 దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 'పోకిరి' వంటి సినిమాలకు కూడా ఆయన డైరెక్షన్ చేసి ఐఫా అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు.
4/5దీంతోపాటు ఆయనకు కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి. పూరి జగన్ టూరింగ్ టాకీస్, వైష్ణో అకాడమీ వంటివి కూడా ఉన్నాయి. ఛార్మీ కౌర్ తో భాగస్వామ్యంతో నడిపిస్తున్నారు. పూరి సంగీత్ అనే మ్యూజిక్ కంపెనీ కూడా పూరి జగన్నాథ్‌కు ఉంది.
5/5ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్ వహించిన బద్రితో పాటు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అప్పు, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు, పోకిరి, శివమణి, గోలీమార్, ఇద్దరమ్మాయిలతో.., హార్ట్ ఎటాక్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు చేశారు. ఆయన భార్య లావణ్య వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.