Purse Vastu Tips: వాస్తు పరంగా కొన్ని చిట్కాలు పాటిస్తే అవి జీవితంలో సానుకూలతను తీసుకువస్తాయి. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ప్రతిరోజు మన వద్ద ఉండే పర్సులో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల వాస్తు పరంగా ప్రయోజనాలు కలుగుతాయి. మీ పర్సులో మిరియాలు పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. శని దోషం కూడా దూరం అవుతుంది.
పర్సులో డబ్బులు పెట్టుకుంటాం. అందులో కొన్ని ముఖ్యమైన పేపర్స్ కూడా పెట్టుకునే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే పర్సులో ఎప్పుడైనా కానీ ఎక్స్పైరీ తేదీ అయిపోయిన పేపర్స్ ఎప్పుడూ పొరపాటున కూడా పెట్టుకోకూడదు.
ముఖ్యంగా కొంతమంది ఏటీఎం రిసీట్స్ కూడా పెట్టుకుంటారు. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే మిరియాలను రెండు గింజలు మన పర్సులో వేసి పెట్టుకుంటే ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యంగా అప్పుల ఊబి నుంచి కూడా త్వరగా బయటపడతారని పండితులు చెబుతున్నారు.
అంతేకాదు శని అశుభ దృష్టితో బాధపడుతున్న వారు పర్సులో మిరియాలు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది.
అసలు డబ్బులు పెట్టే ప్రాంతంలో ఈ మిరియాలు కూడా వేసి పెట్టడం వల్ల వాస్తు పరంగా పాజిటివిటీ పెరుగుతుంది. దీంతో ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. నెగెటివిటీ మీ నుంచి దూరం అవుతుంది. కొత్త ఆలోచనలు చేసి అవకాశం కూడా ఉంది.
మిరియాలు పర్సులో పెట్టుకోవడం వల్ల ధరకర్షణ మరింత పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)