Add Zee Business As A Preferred Source
App

Rahu Gochar: హోలీ తర్వాత ఈ రాశుల వారికీ జాక్ పాట్.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..

Written ByTA Kiran Kumar
Published: Mar 05, 2025, 12:24 PM IST|Updated: Mar 05, 2025, 12:24 PM IST

Rahu Gochar 2025: జ్యోతిషశాస్త్రంలో, రాహువు,  కేతువులను పాప గ్రహాలుగా అభివర్ణిస్తుంటారు. అంతేకాదు ఇవి ఛాయా గ్రహాలు. మిగిలిన ఏడు గ్రహాలు.. సవ్య దిశలో ప్రయాణం చేస్తే.. ఈ రెండు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తాయి.  జ్యోతిష్య శాస్త్రంలో వీటిని పాప గ్రహాలుగా పిలుస్తుంటారు.

Rahu Gocharam 1/5

రాహువు గోచారం

రాహువు, కేతువులు దుష్ట గ్రహాలే అయినప్పటికీ..  జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ గ్రహాలు శుభ స్థానాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. రాహువును కలియుగ రాజుగా అభివర్ణిస్తారు. హోలి తర్వాత రాహువు నక్షత్రం మారుతుంది. మార్చి 16న, రాహువు  నక్రత్ర మార్పు సంభవించబోతుంది. దీంతో వీరి జీవితాలు బంగారుమయం కాబోతున్నాయి.

Mithuna Rasi 2/5

మిథున రాశి

మిథున రాశి: రాహు నక్షత్ర మార్పు వలన మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభించనుంది.  విదేశీ వాణిజ్యం వలన  భారీ లాభాలను అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ఇదే సువర్ణ సమయం. అంతేకాదు ఎంతో కాలం ఎదురు చూస్తోన్న మీ చిరకాల స్వప్నం నెరవేరే అవకాశం ఉంది.

Vrushchika Rasi3/5

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి: రాహు నక్షత్ర మార్పు కారణంగా వృశ్చిక రాశి వారి అంతా మంచే జరగబోతుంది. కొత్త ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాదు పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. దీంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలున్నాయి.  ఇల్లు కొనాలనే వారి కల త్వరలో నెరవేరుతుంది.

Mesha Rasi 4/5

మేషరాశి

మేషరాశి: రాహువు సంచారము కారణంగా, ఈ రాశి వారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.  మీ ఆదాయ వనరుల పెరుగుదల వలన మీరు ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఇంట్లో  శుభ కార్యక్రమాలు జరుగుతాయి.

 

Disclaimer5/5

గమనిక

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ తో పాటు సామాన్య పండితులు.. జ్యోతిస్త్ర శాస్త్రంలో ఉన్న అంశాల ఆధారంగా మేము ప్రస్తావించాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.