Rahu Shukra Yuti 2026: నవ గ్రహాల్లో రాహు, కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు ఛాయ గ్రహాలు. అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. మరోవైపు శుక్రుడు నవగ్రహాల్లో అందం, ఆకర్షణ, విద్య ఇతరత్రా అంశాలకు ప్రతీక. తాజాగా రాహు, శుక్రుడు
ఒకే రాశిలో మహా సంయోగం కాబోతున్నాయి.
1/6వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సరిగ్గా 18 యేళ్ల తర్వాత శుక్రుడు, దుష్ట గ్రహం రాహువు యొక్క గొప్ప సంయోగం 2026 లో జరుగబోతుంది. ఇది కొన్ని రాశులను వారికి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట సమయంలో దాని స్థానాన్ని మారబోతుంది. అదే సమయంలో, కొన్నిసార్లు ఒకే రాశి లేదా నక్షత్రంలో, కొన్నిసార్లు స్నేహపూర్వక గ్రహాలతో కొన్నిసార్లు శత్రు గ్రహాలతో ఏర్పరిచే సంయోగం కారణంగా ప్రత్యేక ఫలితాలను అందుకోబోతున్నారు. కొన్ని రాశుల వారికి జాతకం మారబోతుంది.
2/6మిథున రాశి..
మిథున రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో రాహువు, శుక్రుడు సంయోగం చెందడం వల్ల మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు అందుకోబోతున్నారు. ఈ కాలంలో మిథున రాశి వారికి మంచి ఫలితాలు అందుకోబోతున్నారు. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులలో కొత్త పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది.
3/6ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి నుండి మూడవ ఇంట్లో రాహువు-శుక్ర సంయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితిని లేదా సవాలును సులభంగా అధిగమిస్తారు. విదేశీ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ప్రతి పనిలోనూ మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది.
4/6వృషభ రాశి.. రాహువు, శుక్రుడు వృషభ రాశి పదవ ఇంట్లో ఉండటం మూలానా.. ఈ రాశి వారు తమ కెరీర్‌లో మంచి ఫలితాలను అందుకున్నారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారవేత్తలు గణనీయమైన లాభాలను అందుకుంటారు. ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల మద్దతుతో పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
5/6కర్కాటక రాశి.. కర్కాటకం నుండి తొమ్మిదవ ఇంట్లో రాహువు-శుక్రుడి గొప్ప కలయిక వారి జీవితంలో సానుకూల ఫలితాలను అందుకోబోతుంది. కొత్త యేడాది ప్రారంభంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మంచి లాభాలను అందుకుంటారు. మీరు కుటుంబ సభ్యులతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
6/6గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీనిని నిర్ధారించడం లేదు.