Rahul Gandhi Fitness Secret: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ పార్టీ అగ్రనేతగా పార్టీని సరైన దారిలో నడిపించడంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అన్నింటిని తన దైన శైలిలో తిప్పికొట్టి తానమేంటో ప్రూవ్ చేసుకున్న నేత. ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాహుల్ గాంధీ వయస్సు 55 ఏళ్లు. అయినప్పటికీ పాతికేళ్ల యువకుడిలానే కనిపిస్తుంటారు. రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే నేతల్లో రాహుల్ గాంధీ ముందుంటారు. 55 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టినా.. ఆయనను చూస్తే ఇంకా యవ్వనంతో నిండిన 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. పాదయాత్రలు, పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్, దేశం నలుమూలలా చేసే సైక్లింగ్ .. అన్నింటిలోనూ ఆయన చూపించే ఎనర్జీ యువతలోనూ అరుదే అని చెప్పాలి. ఈ అద్భుతమైన ఫిట్నెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
రాహుల్ గాంధీ ఫిట్నెస్ సాధారణ వ్యాయామాల వరకే కాదు .. ఆయన జీవనశైలి పూర్తిగా యాక్టివ్‌గా ఉండేలా డిజైన్ చేసుకుంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి రన్నింగ్, స్విమ్మింగ్, స్ట్రెంథ్ ట్రైనింగ్, సైక్లింగ్ వంటి కార్యకలాపాలకు సమయం కేటాయిస్తారు. హిమాలయాలు వంటి క్లిష్టమైన మార్గాల్లో ఆయన చేసిన ట్రెక్కింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. శారీరక శ్రమ వల్ల ఏ వాతావరణంలోనైనా, ఎంత దూరమైనా ఆయన తన వేగాన్ని, స్టామినాను నిలుపుకుంటారు.
రోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆయన ఆహార అలవాట్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాహుల్ ఎక్కువగా లైట్, క్లీన్గా, ప్లాంట్-బేస్డ్ ఫుడ్‌ను పాటిస్తారని అంటారు. జంక్ ఫుడ్, దీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉంటారు. ఎక్కువ ప్రోటీన్, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్.. ఆయన డైట్‌లో ఇవే ప్రధానమైనవి. అదనంగా యోగా, ధ్యానం ఆయన రోజువారీ రొటీన్‌లో భాగం. ఇవి ఆయనకు శారీరక శక్తితో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా ఇస్తాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాహుల్ గాంధీకి సెల్ఫ్-డిసిప్లిన్ అసాధారణ స్థాయిలో ఉంటుంది. బిజీ రాజకీయ షెడ్యూల్ ఉన్నా కూడా ఫిట్నెస్ టైమ్‌ను మిస్ కావడం చాలా అరుదు. వ్యక్తిగత జీవితం ప్రశాంతంగానే ఉండటంతో ఆయనకు తనకోసమే క్వాలిటీ టైమ్ దొరుకుతుంది. అదే ఆయన ఆరోగ్యానికి, ఇంటర్నల్ స్ట్రెంత్‌కి ప్రధాన కారణమని చెబుతుంటారు.
ఇక మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ అనే విషయం తెలిసిందే. ఆయనకు డైవింగ్ కూడా వచ్చు. అంతేకాదు తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా క్రమం తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ తరగతులు తీసుకునేవాడనంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.
రాహుల్ కార్బొహైడ్రేట్స్ అస్సలు తినరు. ఎక్కువగా రోటీని ఇష్టపడుతారు. అయితే తాను మాంసహార ప్రియుడు. వంటకాల్లో ఎక్కువగా చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, సాదా ఆమ్లెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ప్రతిరోజూ ఉదయం కప్పు కాఫీ మాత్రం తాగనిదే ఆయనకు మనస్సు హాయిగా ఉండదట. ఇక బరువును కంట్రోల్లో ఉంచుకునేందుకు గుమ్మడికాయ, పిస్తాపప్పులు, నవ్వులు వంటి విత్తనాలు, గింజలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ పై అద్భుతమైన ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటిని డైట్లో చేర్చుకుంటారు.