Add Zee Business As A Preferred Source
App

Railway Jobs: 10వ తరగతి పాస్ అయితే చాలు.. రైల్వేలో జాబ్ మీ సొంతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు ఇవే..!

Written ByAruna Maharaju
Published: Sep 06, 2025, 05:49 PM IST|Updated: Sep 06, 2025, 05:49 PM IST

Eastern Railway Jobs 2025: భారత రైల్వేలో ఉద్యోగం కోసం చూస్తున్నారా..? క్రీడలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఈస్టర్న్ రైల్వే అద్భుతమైన అవకాశం అందిస్తోంది. స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ C, గ్రూప్ Dలో 50 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 

Eastern Railway Recruitment 20251/5

ఇండియన్ రైల్వేలో జాబ్స్

భారత రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? క్రీడలలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఈస్టర్న్ రైల్వే అద్భుతమైన అవకాశం అందిస్తోంది. స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ C, గ్రూప్ Dలో 50 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10, 2025 నుంచి అక్టోబర్ 9, 2025 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు rrcer.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.   

Eastern Railway Jobs 20252/5

రైల్వేలో జాబ్స్

మొత్తం 50 పోస్టుల్లో గ్రూప్ C (లెవెల్-4/5)లో 5, గ్రూప్ C (లెవెల్-2/3)లో 12, గ్రూప్ D (లెవెల్-1)లో 33 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసే వారి వయసు జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల విషయంలో, లెవెల్-4/5 పోస్టులకు గ్రాడ్యుయేషన్, లెవెల్-2/3 పోస్టులకు 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా ITI/అప్రెంటిస్‌షిప్, లెవెల్-1 పోస్టులకు 10వ తరగతి లేదా ITI/NAC పూర్తి చేసి ఉండాలి.  

Railway Recruitment3/5

రైల్వేలో ఉద్యోగాలు

క్రీడా అర్హతల పరంగా, లెవెల్-4/5 పోస్టులకు ఒలింపిక్స్ లేదా ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో 3వ స్థానం, లెవెల్-2/3 పోస్టులకు ఆసియా లేదా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం లేదా జాతీయ స్థాయిలో 1వ లేదా 3వ స్థానం, లెవెల్-1 పోస్టులకు రాష్ట్ర స్థాయి లేదా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో కనీసం 8వ స్థానం సాధించి ఉండాలి.  

Railway Jobs Alert4/5

ఈస్టర్న్ రైల్వేలో జాబ్స్

ఎంపికైన వారికి 7వ వేతన సంఘం ప్రకారం లెవెల్-1కి రూ.18,000, లెవెల్-2/3కి రూ.19,900-20,000, లెవెల్-4/5కి రూ.24,000-28,000 వేతనం లభిస్తుంది. అదనంగా డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, పెన్షన్, ఉచిత రైలు పాస్‌లు, మెడికల్ సౌకర్యాలు కూడా అందుతాయి.   

Eastern Railway Recruitment 20255/5

ఈస్టర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు

ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉన్నాయి. మొదట క్రీడా ట్రయల్స్‌లో నైపుణ్యం, ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తారు. రెండవ దశలో క్రీడా సాధనలు, విద్యార్హతల ఆధారంగా మార్కులు ఇస్తారు. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!