Add Zee Business As A Preferred Source
App

RRB Notification 2025: నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్.. 2570 పోస్టులతో రైల్వే జాబ్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

Written ByAruna Maharaju
Published: Oct 07, 2025, 07:18 PM IST|Updated: Oct 07, 2025, 07:18 PM IST

RRB  Recruitment: రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) భారతీయ రైల్వేలో మరో 2,570 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. 

RRB Notification 20251/5

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్

భారతీయ రైల్వేలో పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశంలోని అన్ని ఆర్ఆర్‌బీల్లో కలిపి మొత్తం 2570 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA)లో జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టులను భర్తీ చేయనున్నారు. 

RRB Notification 20252/5

రైల్వేలో కొలువుల జాతర

విద్యార్హతలు ఇలా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

Indian Railway Jobs3/5

నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి ప్రారంభ తేది అక్టోబర్ 31 కాగా.. చివరి తేది నవంబర్ 30.   

Rrb Recruitment 20254/5

2570 పోస్టులతో రైల్వే జాబ్స్

అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500.   

Rrb Recruitment 20255/5

2570 పోస్టులతో రైల్వే జాబ్స్

రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు rrbguwahati.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించండి.