Railway Tips: రైలు ప్రయాణంలో నీళ్ల బాటిల్‌ ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా?

Know How To Get Free Bottle In Train Journey: రైలు ప్రయాణంలో ప్రయాణికులు కొన్ని సేవలు ఉచితంగా పొందవచ్చు. రైలు ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులకు నీళ్ల బాటిల్‌ ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా వాటర్ బాటిల్ ఎలా పొందాలో తెలుసా?

1 /6

ప్రజా రవాణాలో రైల్వే సేవలు ప్రధానంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే ప్రజలకు విశేష సేవలు అందిస్తోంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. టాయిలెట్లు, నిద్ర సౌకర్యాలు ఉండడంతో ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు రైళ్లలో హాయిగా ప్రయాణం చేస్తున్నారు. రైల్వే శాఖ ఉచితంగా నీళ్ల సీసా ఇస్తారనే విషయం తెలుసా?

2 /6

రైళ్లలో ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ తక్కువ ధరలకు ఆహారాన్ని అందిస్తుండగా.. నీళ్ల సీసా మాత్రం ఉచితంగా ఇస్తున్నారు. ప్రస్తుతం నీళ్ల బాటిల్‌ రైల్వే శాఖ రూ.15కు అమ్ముతోంది. అయితే ఐఆర్‌సీటీసీ వందే భారత్, రాజస్థానీ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉచితంగా వాటర్ బాటిల్ లభిస్తోంది.

3 /6

రైలులో ఆహారం, నీళ్ల సీసా కావాలంటే రైలు టికెట్‌తో పాటు ఆహార ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. వందే భారత్, రాజస్థానీ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నీటి బాటిళ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అంశం వివాదం రేపడంతో రైల్వే అధికారి స్పందించారు.

4 /6

ఆహారం ఎంచుకున్నా ఎంచుకోకపోయినా రైలులోని ప్రయాణికులందరికీ ఉచితంగా నీళ్ల బాటిల్ అందిస్తారని రైల్వే శాఖ అధికారి స్పష్టం చేశారు. వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆహారం ఆర్డర్‌ చేయకపోయినా ఉచితంగా నీటి సీసాను ఇస్తారని రైల్వే అధికారి వివరణ ఇచ్చారు.

5 /6

రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులను ఆహారం కూడా తీసుకోవాలని ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్ బలవంతం చేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై కూడా రైల్వే అధికారి వివరణ ఇచ్చారు.

6 /6

రైలు ప్రయాణంలో ఆహారం తీసుకోవాలని తప్పనిసరిగా చేస్తున్నారనేది తప్పుడు సమాచారం అని అధికారి కొట్టిపారేశారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి లేదా యాప్‌లో నో ఫుడ్ ఆప్షన్‌ను తొలగించలేదని చెప్పారు. రాజధాని, శతాబ్ది లేదా వందే భారత్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు బుకింగ్ పేజీలో నో ఫుడ్‌ ఆప్షన్ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే నో ఫుడ్‌ ఆప్షన్‌ను గతంలో ఉన్న చోట కాకుండా వేరే ప్రదేశానికి తరలించామని.. అంతేకానీ తొలగించలేదని రైల్వే అధికారి వివరణ ఇచ్చారు.