Add Zee Business As A Preferred Source
App

Heavy Rains: రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Written ByAruna Maharaju
Published: Sep 30, 2025, 08:29 AM IST|Updated: Sep 30, 2025, 08:29 AM IST

Telangana Rains : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Heavy Rains In Telangana1/5

తెలంగాణలో వర్షాలు

అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది అక్టోబర్ 1వ తేదీ నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.   

Weather Update2/5

తెలంగాణలో వర్షాలు

మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ గుజరాత్, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 Rain Alert3/5

రెయిన్ అలర్ట్

రాష్ట్రంలో ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.   

Heavy Rains4/5

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలతోపాటు.. హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Rain Alert In Telangana5/5

బంగాళాఖాతంలో అల్పపీడనం

ప్రస్తుతం భద్రాచలం వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వస్తుంది.