Add Zee Business As A Preferred Source
App

Raj Nidimoru Net Worth: రాజ్ నిడిమోరు ఆస్తుల వివరాలు…నాగచైతన్య కన్నా ఎక్కువ.. తక్కువ..?

Written ByVishnupriya
Published: Dec 01, 2025, 05:08 PM IST|Updated: Dec 01, 2025, 05:08 PM IST

Samantha Husband : ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు.. దర్శకుడు–రచయిత రాజ్ నిడిమోరు గురించి నిన్నటి నుండి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరూ గుప్తంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇక ఇదే విషయాన్ని సమంత మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో సంతోషం నెలకొల్పింది..

Raj Nidimoru Assets 1/6

రాజ్ నిడిమోరు ఆస్తులు

డిసెంబర్ 1 ఉదయం ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సన్నిహితుల మధ్య సమంత, రాజ్ వివాహం జరిగింది. ఈ వేడుకకు కేవలం 30 మంది మాత్రమే హాజరవ్వగా, సమంత ఎరుపు రంగు చీరలో కనిపించింది.ఇటువంటి

Samantha Husband Net Worth 2/6

రాజ్ నిడిమోరు ఆస్తులు

కొన్ని నెలలుగా రాజ్ నిడిమోరు.. సమంత సన్నిహితంగా కనిపించడం, సినిమాల షూటింగ్స్‌లో కలుసుకోవడం వంటి కారణాల వల్లే వారిద్దరి మధ్య ప్రేమ ఉంది అని ఊహాగానాలు మొదలయ్యాయి. ‘ది ఫ్యామిలీ మాన్’, ‘ఫర్జీ’ వంటి వెబ్ సిరీస్‌లతో పేరుపొందిన రాజ్ నిడిమోరుతో .మీసమంత.. వెబ్ సిరీస్ చేసేటప్పుడు దగ్గరయ్యారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది.

Samantha Husband 3/6

రాజ్ నిడిమోరు ఆస్తులు

రాజ్ నిడిమోరు  ముందుగా శ్యామలి దేను వివాహం చేసుకున్నారు. 2022లో వీరిద్దరూ విడిపోయారు. సమంత కూడా 2021లో నటుడు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత ప్రస్తుత భర్త, మాజీ భర్త.. ఆస్తుల వివరాలు వైరల్ గా మారాయి.  

Samantha First Husband Net Worth4/6

రాజ్ నిడిమోరు ఆస్తులు

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక సాధారణ తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన..చదువులో మెరుగ్గా ఉండేవారు. SVU ఇంజినీరింగ్ కాలేజీలో.. కంప్యూటర్ సైన్స్‌లో B.Tech చదువుతుండగానే.. తన భవిష్యత్తు భాగస్వామి అయిన దర్శకుడు కృష్ణ డీకేని కలిశారు. ఇద్దరూ కలిసి అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేశారు. 

Samantha Husband Assets5/6

రాజ్ నిడిమోరు ఆస్తులు

రాజ్ & డీకే గా పేరుపొందిన ఈ జోడీ Flavors, 99, శోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆర్థికంగా చూస్తే కూడా రాజ్ నిడిమోరు మంచి స్థితిలో ఉన్న దర్శకుడు. బాలీవుడ్.. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన నికర ఆస్తి సుమారు రూ. 83–85 కోట్ల మధ్యలో ఉన్నట్లు అంచనా. 

Samantha Net Worth6/6

రాజ్ నిడిమోరు ఆస్తులు

మరోపక్క నాగచైతన్య ఆస్తుల వివరాలకు.. వస్తే నాగచైతన్యకి దాదాపు 154 కోట్ల ఆస్తి ఉంది. ఇక మొత్తం అక్కినేని ఫ్యామిలీకి కానీ వెయ్యి కోట్ల ఆస్తి ఉంది. దీంతో.. రాజ్ కన్నా నాగచైతన్య కి రెట్టింపు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క సమంతకు దాదాపుగా 100 కోట్ల ఆస్తి ఉంది అని సమాచారం. దీంతో రాజ్, సమంత ఇద్దరి ఆస్తులు కలిపితే.. దాదాపుగా..185 కోట్లు ఉంటాయి.